
సురేశ్‌బాబు, హేమచంద్రా రెడ్డి
కె.హేమచంద్రా రెడ్డి హీరోగా ‘ఇద్దరికీ కొత్తేగా’ సినిమా ప్రారంభమైంది. కృష్ణ క్రియేషన్స్పై కుల్లపరెడ్డి సురేశ్‌బాబు స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. తొలి సీన్‌కి నిర్మాతలు సి.కల్యాణ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, చదలవాడ శ్రీనివాసరావు క్లాప్ కొట్టారు. నిర్మాత కె.ఎల్. దామోదర ప్రసాద్ దర్శకత్వం వహించారు.
హైకోర్టు న్యాయమూర్తి శ్వేత, ప్రసన్న కుమార్, దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, మాజీ జడ్జి మాల్యాద్రి, మేక మేనక స్క్రిప్ట్‌ను సురేశ్‌బాబుకు అందించారు. ‘‘గతంలో నేను ‘వకాలత్ నామా’ సినిమాలో హీరోగా చేశాను. ఇప్పుడు ‘ఇద్దరికీ కొత్తేగా’ కి తీస్తున్నాను. నిర్మాత కేయస్ రామారావుగారు మాకు అండగా నిలిచారు’’అన్నారు కుల్లపరెడ్డి సురేశ్‌బాబు. ఈ చిత్రానికి కెమెరా: కోట తిరుపతిరెడ్డి, సంగీతం: ఎం.ఎం.ఎస్.
Comments
Please login to add a commentAdd a comment