
లోకనాయకుడు కమలహాసన్ దళపతి విజయ్ కథానాయకుడు నటించనున్న చిత్రంలో అతిథి పాత్రలో మెరువనున్నారనే వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ అవుతోంది. విజయ్ కథానాయకుడిగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించిన తాజా చిత్రం గోట్. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకొని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. దీంతో విజయ్ తన 69వ చిత్రానికి సిద్ధమవుతున్నారు.
ఇదే ఈయన చివరి చిత్రం అనే ప్రచారం చాలా రోజుల నుంచే జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత విజయ్ పూర్తిగా రాజకీయాలపై దృష్టి సారిస్తారని సమాచారం. ఇకపోతే ఆయన 69వ చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారంలో ఉంది. ఇది పూర్తిగా రాజకీయ నేపథ్యంలో సాగే కథా చిత్రం అని కూడా ప్రచారం జరుగుతోంది. మరో విషయం ఏంటంటే ఈ చిత్రను కథను దర్శకుడు హెచ్ వినోద్ నటుడు కమలహాసన్ కోసం తయారు చేశారని సమాచారం.
నిజం చెప్పాలంటే కమలహాసన్ హెచ్ వినోద్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేశారు. ఆ చిత్ర కథా చర్చల్లోనూ ఆయన దర్శకుడు హెచ్ వినోద్‌తో కలిసి పాల్గొన్నారు. అనివార్య కారణాలవల్ల ఆ చిత్రం తెరకెక్కలేదు. ఆ తర్వాత దర్శకుడు హెచ్ వినోద్ విజయ్ హీరోగా చిత్రం చేయడానికి సిద్ధమయ్యారని సమాచారం. అయితే కమలహాసన్ నటించాల్సిన కథనే ఆయన విజయ్‌తో చేస్తున్నారా? అన్న విషయంపై క్లారిటీ లేదు. తాజాగా విజయ్ కథానాయకుడుగా నటించే చిత్రంలో నటుడు కమలహాసన్ అతిథి పాత్రలో నటించబోతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరలవుతోంది. ఇందులో నిజం ఎంత అన్నది కూడా తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment