
ఇటీవల గోవా పర్యటనకు వెళ్లిన కన్నడ హీరో దిగంత్ మంచలే ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అతడు ప్రస్తుతం బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇటీవల భార్య ఐంద్రిత రేతో గోవా పర్యటనకు వెళ్లిన అతడు అక్కడ బీచ్‌లో జంప్ చేస్తుండగా గాయపడ్డాడు. దీంతో అతడికి గోవాలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక విమానంలో బెంగళూరుకు తరలించారు.
చదవండి: పూజాకు నిర్మాతలు షాక్, ఆ బిల్లులు కట్టమని చేతులెత్తేశారట!
అయితే ప్రమదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ‘వాన’ చిత్రంలో కీ రోల్ పోషించిన దిగంత్‌కు అడ్వెంచర్స్ చేయడం అంటే ఆసక్తి. దీంతో తరచూ అతడు సైకిలింగ్, ట్రెక్కింగ్, సముంద్రంలో స్క్యూబా డైవింగ్ చేస్తుంటాడు. అంతేకాదు ఈ వీడియోలను తరచూ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తుంటాడు. కాగా గాలిపాట, హౌస్‌ఫుల్ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన దిగంత్ ఇటీవల నటించిన గాలిపాట 2 మూవీతో ఆగష్టు 12న విడుదలకు సిద్ధమవుతుంది. ప్రస్తుతం తెలుగులో అడివి శేష్ నటించిన ‘ఎవరు’ కన్నడ రీమేక్‌లో నటిస్తున్నాడు.