దివంగత దర్శకుడు సిద్దలింగయ్య సతీమణి, కన్నడ నటి శ్యామలా దేవి(68) పోలీసులను ఆశ్రయించింది. ఆస్తి కోసం కొడుకు, కోడలు వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారని, తరచూ అసభ్యంగా తిడుతూ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని పేర్కొంది. కుమారుడు నితిన్ మొదట్లో బాగానే ఉండేవాడని, ఎప్పుడైతే అతడికి పెళ్లయిందో అప్పటినుంచి భార్య స్మితతో కలిసి తనను టార్చర్ పెడుతున్నాడని వాపోయింది. బెంగళూరులో ఓ ఇల్లు కొన్నానని, అందులోనే కుటుంబంతో కలిసి నివసిస్తున్నామని చెప్పింది. అయితే ఆ ఇల్లు కొడుకు, కోడలు తమ పేరు మీద రాయాలని నిత్యం వేధిస్తున్నారంది.
కాగా శ్యామలా దేవి కొడుకు, కోడలు పెట్టే వేధింపులు తట్టుకోలేక గతంలో సీనియర్ సిటిజన్ ఫోరమ్‌ను ఆశ్రయించింది. ఆన్‌లైన్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు ద్వారా తన ప్రమేయం లేకుండానే తన ఖాతాలో నుంచి డబ్బులు తీస్తున్నారని ఆరోపించింది. తనకు మానసిక ప్రశాంతత లేకుండా చేస్తున్న వాళ్లిద్దరినీ ఇల్లు ఖాళీ చేసేలా ఆదేశాలివ్వాలని కోరింది. కానీ అంతలోనే కోడలు గర్భం దాల్చడంతో కొడుకు క్షమించమని కాళ్లు పట్టుకున్నాడు. తల్లి మనసు కరిగిపోయి ఆ ఫిర్యాదును వెనక్కు తీసుకుంది.
మారుతారేమో అని ఎదురుచూసింది కానీ అది జరగలేదు. మళ్లీ వాళ్లు వక్రబుద్ధి చూపించారు. శ్యామలాదేవిని వంటగదితో పాటు ఇతరత్రా గదుల్లోకి కూడా వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. ఇంటిని తమ పేరు మీద రాయమంటూ నిత్యం వేధించారు. లేదంటే త్వరలోనే చస్తావంటూ శాపనార్థాలు పెట్టారు. ఇవన్నీ భరించలేకే పోలీసులకు ఫిర్యాదు చేశానంటోంది శ్యామలా దేవి.
చదవండి: అనుమానాస్పద స్థితిలో సింగర్ మృతి.. హత్యా? ఆత్మహత్యా?
Comments
Please login to add a commentAdd a comment