Kiran Abbavaram: Nenu Meeku Baga Kavalsina Vadini Movie Teaser Release Deets Here - Sakshi
Sakshi News home page

Kiran Abbavaram Movie: ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ టీజర్‌ డేట్‌ ఫిక్స్‌

Published Fri, Jul 8 2022 12:05 PM | Last Updated on Fri, Jul 8 2022 1:33 PM

Kiran Abbavaram Nenu Meeku Baga Kavalsina Vadini Movie Teaser Release On July 10th - Sakshi

రాజావారు రాణిగారు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై, ఫస్ట్ మూవీతోనే ఇటు ప్రేక్షకుల్ని అటు విమర్శకుల్ని మెప్పించాడు యంగ్‌ టాలెంటెడ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం. ఆ వెంటనే ఎస్.ఆర్.కళ్యాణమండపం, సెబాస్టియన్‌ చిత్రాలతో అలరించాడు. ఇటీవల సమ్మతమేతో పలకరించాడు. ప్రస్తుతం అతడి చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. అందులో ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ ఒకటి. శ్రీధ‌ర్ గాదె ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుపుకుంటుంది. షూటింగ్ మొద‌లై నెల‌లు దాటుతున్న ఈ సినిమా గురించి అప్‌డేట్‌లు రావ‌డంలేదు. 

చదవండి: నటుడు ప్రభు ఇంట ఆస్తి వివాదం.. కోర్టును ఆశ్రయించిన తోబుట్టువులు

ఈ నేప‌థ్యంలో చిత్ర‌బృందం ఓ బిగ్ అప్‌డేట్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమా టీజ‌ర్ డేట్‌ను తాజాగా చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. జూలై 10న 11.05 నిమిషాల‌కు ఈ చిత్ర టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో కిర‌ణ్  స్టైలిష్‌లుక్‌లో దర్శనం ఇచ్చాడు. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో కిర‌ణ్‌కు జోడీగా సంజ‌నా ఆనంద్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని కోడి రామ‌కృష్ణ స‌మ‌ర్ప‌ణ‌లో కోడి దివ్వ దీప్తి నిర్మిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement