ఆ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా: మాళవిక మోహనన్ | Kollywood Actress Malavika Mohanan Hopes On Suriya Movie Thangalan | Sakshi
Sakshi News home page

Malavika Mohanan: ఇంత ఉద్వేగాన్ని ఎప్పుడూ చూడలేదు: మాళవిక మోహనన్

Oct 5 2023 3:02 PM | Updated on Oct 5 2023 3:09 PM

Kollywood Actress Malavika Mohanan Hopes On Suriya Movie Thangalan - Sakshi

ప్రస్తుతం సక్సెస్‌ కోసం తహతహలాడుతున్న నటీమణుల్లో మాళవికా మోహనన్‌ ఒకరు. నిజం చెప్పాలంటే ఈ మలయాళ బ్యూటీ కోలీవుడ్‌లో ఇప్పటివరకూ ఒక్క సరైన హిట్‌ను అందుకోలేదనే చెప్పాలి. పేట చిత్రంతో కోలీవుడ్‌కు అడుగుపెట్టిన ముద్దుగుమ్మ  ఒకే అనిపించుకుంది. అయితే ఈ సినిమాతో నటిగా మాళవికా మోహనన్ మంచి పేరు తెచ్చుకుంది. ఆ తరువాత ధనుష్‌ సరసన జగమే తంతిరం చిత్రంలో నటించింది. అది ఓటీటీలో స్ట్రీమింగ్‌ కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. 

(ఇది చదవండి: ఇదే నా చివరి సినిమా: జాతిరత్నాలు డైరెక్టర్‌)

తాజాగా పా.రంజిత్‌ దర్శకత్వంలో విక్రమ్‌కు జంటగా తంగలాన్‌ చిత్రంలో నటించింది. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తిచేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. దర్శకుడు పా.రంజిత్‌ చిత్రాల్లో కథానాయికలకు ప్రాముఖ్యత ఉంటుంది. ఇక తంగలాన్‌ చిత్రంలో విక్రమ్‌ గెటప్‌ నుంచి.. ఆయన నటన వరకూ అన్నీ వైవిధ్యంగా ఉన్నాయి. 

హీరోయిన్‌ మాళవిక మోహనన్ కూడా తన పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది అంటోంది. దీని గురించి ఆమె ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె పేర్కొంటూ తాను ఇప్పటివరకూ నటించిన చిత్రాల్లో ఛాలెంజింగ్‌ పాత్రను తంగలాన్‌ చిత్రంలో పోషించినట్లు చెప్పింది. తన జీవితంలో ఇంత ఉద్వేగాన్ని ఎప్పుడూ చూడలేదని పేర్కొంది. ఇందులోని తన నటన మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆ పాత్రలో అంత అర్థం ఉందని, అందుకే తంగలాన్‌ చిత్రం విడుదల కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు చెప్పింది. ఈ చిత్రం తన కెరీర్‌కు టర్నింగ్‌ అవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. కాగా తంగలాన్‌ చిత్రం సంక్రాంతి బరిలో నిలవనున్నట్లు కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.

(ఇది చదవండి: సెన్సార్‌ బోర్డుకు లంచం.. విశాల్ ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు! )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement