యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో అదుర్స్ ఒకటి. వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2010లో రిలీజై ఘన విజయం సాధించింది. ఇందులో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ ప్లే చేశాడు. చారి పాత్రలో ఎన్టీఆర్ పండించిన కామెడీ అంత ఇంతకాదు. ఇంతవరకు ఎప్పుడు ఎన్టీఆర్‌ని ఆ తరహా పాత్రలో చూడలేదు. బ్రహ్మానందం, ఎన్టీఆర్ మధ్య వచ్చే సీన్స్ సినిమాకే హైలెట్. సినిమా చూసిన ప్రతి ఒక్కరు చారి పాత్రను మరిచిపోరు. అంతగా ఆ పాత్రలో ఒదిగిపోయాడు ఎన్టీఆర్. ఈ చిత్రానికి సీక్వెల్ వస్తే బాగుంటుందని చాలా మంది కోరుకుంటున్నారు.
తాజాగా ఆ చిత్ర రచయిత కోన వెంకట్ కూడా స్వీక్వెల్ వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఎప్పటికైనా మంచి పాయింట్‌తో అదుర్స్ 2 తెరకెక్కిస్తామని, ఆ సినిమాకు ఎన్టీఆర్ మాత్రమే న్యాయం చేయగలడని కోన వెంకట్ అన్నారు. బుధవారం జరిగిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కోనవెంకట్ అదుర్స్ 2 అప్‌డేట్ ఇచ్చాడు. ‘అదుర్స్ 2 చేయాలని పక్కాగా అనుకుంటున్నాను. ఎప్పటికైనా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాం. అవసరం అయితే నేనే తారక్ ఇంటిముందు ధర్నా చేసి మరీ సినిమాకు ఒప్పిస్తా. చారి పాత్రను ఎన్టీఆర్ తప్ప దేశంలో మరెవరూ చేయలేరు.ఎన్టీఆర్ కెరీర్లోనే అది బెస్ట్ మూవీ. ఆ క్యారెక్టర్, ఆ ఆహార్యం, ఆ మాడ్యులేషన్.. ఆ క్యారెక్టర్‌ను ఎన్టీఆర్‌లాగా చేసే వారు ఇండియాలోనే లేరు’ అని కోన వెంకట్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment