మెగాస్టార్ మూవీ రివ్యూ.. అందరికంటే ముందుగానే! | Megastar Chiranjeevi review On Ms Shetty Mr Polishetty Movie | Sakshi
Sakshi News home page

Chiranjeevi: 'మిస్ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి' చిత్రంపై మెగాస్టార్ ఏమన్నారంటే..!

Published Tue, Sep 5 2023 1:41 PM | Last Updated on Tue, Sep 5 2023 2:08 PM

Megastar Chiranjeevi review On Ms Shetty Mr Polishetty Movie - Sakshi

జాతిరత్నాలు సినిమాతో తిరుగులేని క్రేజ్‌ అందుకున్న హీరో నవీన్‌ పొలిశెట్టి. ఈ సినిమా తర్వాత ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఇందులో స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శెట్టి హీరోయిన్‌గా నటించింది. మోస్ట్ రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో మహేశ్ బాబు  దర్శకుడిగా పరిచయమవుతున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై  ఈ మూవీని నిర్మిస్తున్నారు.  ఇప్పటికే టీజర్‌ రిలీజ్‌ కాగా.. ఈ చిత్రంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం సెప్టెంబర్‌  7న థియేటర్లో సందడి చేయనుంది.

(ఇది చదవండి: అనుష్కతో హగ్స్‌.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన నవీన్‌

తాజాగా ఈ చిత్రాన్ని చూసిన మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. సినిమా చాలా బాగుందంటూ కితాబిచ్చారు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. మిస్ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి సినిమాకు మెగాస్టార్ అందరికంటే ముందుగా రివ్యూ ఇచ్చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి చిరంజీవి అభినందనలు తెలిపారు. మరోసారి అభిమానులతో కలిసి థియేటర్లో చూడాలన్న కోరిక కలిగింది అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ సైతం ఆల్ ది బెస్ట్ అంటూ నవీన్‌ పోలిశెట్టికి అభినందనలు చెబుతున్నారు.  

(ఇది చదవండి: తల్లి కావడానికి ప్రెగ్నెంట్‌ కావాలి కానీ.. పెళ్లెందుకు?: అనుష్క!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement