ఏడ్చీఏడ్చీ అలిసిపోయా. ఇంకా ఏడుస్తూ ఉండటం తన వల్ల కాదంటోంది బాలీవుడ్ నటి రసిక దుగల్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నేను ఏ స్క్రిప్ట్ అందుకున్నా చివర్లో కచ్చితంగా రెండు ఏడుపు సన్నివేశాలు రాసేవారు. అది పది పేజీల స్క్రిప్ట్ అయినా సరే.. ఏడుపు తప్పనిసరిగా ఉండేది.
ఓటీటీల వల్లే..
అలాంటి పాత్రల్లో పదే పదే నటించి బోర్ కొట్టేసింది. ఈ మధ్య దర్శకరచయితలు కాస్త రూటు మార్చారు. నాకంటూ కొత్త రోల్స్ ఇస్తున్నారు. అందుకు సంతోషంగా ఉంది. ఓటీటీల వల్లే ఇది సాధ్యమైంది. అంతకుముందు నేను ఎన్నో సినిమాలు చేశాను. కానీ మీర్జాపూర్ వంటి సిరీస్‌ల వల్ల మరింత పేరు సంపాదించుకున్నాను, ఎక్కువ అవకాశాలు అందుకుంటున్నాను. ఎంతోమంది ప్రేక్షకులను అలరించగలుగుతున్నాను. చిన్న చిత్రాలకు ఓటీటీలు బెస్ట్ ఛాయిస్.
మీర్జాపూర్‌తో ఫేమస్
కానీ ఇప్పుడు చిన్న చిత్రాలు ఓటీటీలోకి రావడం కూడా కష్టమైపోతోంది. అయితే కొత్తదనానికి, కొత్త టాలెంట్‌కు, కొత్త ఐడియాలకు మాత్రం డిజిటల్ ప్లాట్‌ఫామ్ మంచి వేదికగా మారింది అని చెప్పుకొచ్చింది. మీర్జాపూర్ వెబ్ సిరీస్‌తో ఫుల్ పాపులారిటీ సంపాదించిన రసిక . శేఖర్ హోమ్ అనే షోలో భాగమైంది. ఈ షో ప్రస్తుతం జియో సినిమాలో స్ట్రీమ్ అవుతోంది. ఆమె నటించిన లిటిల్ థామస్ చిత్రం ఆగస్టు 19న ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ మెల్‌బోర్న్‌లో ప్రసారం కానుంది.
చదవండి: అర్ధరాత్రి స్నానం, ఐదింటికి నిద్ర.. షారూఖ్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే!
Comments
Please login to add a commentAdd a comment