
విరాన్ ముత్తంశెట్టి, లావణ్య జంటగా నటించిన సినిమా 'ముఖ్య గమనిక'. శివిన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజశేఖర్, సాయి కృష్ణ నిర్మించారు. వేణు మురళీధర్. వి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఫిబ్రవరి 23న థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక తాజాగా హైదరాబాద్‌లో జరగ్గా.. హీరో విశ్వక్ సేన్ గెస్ట్‌గా వచ్చాడు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
(ఇదీ చదవండి: కొత్త పెళ్లి కూతురిలా సన్నీ లియోన్.. వీడియో వైరల్!)
విరాన్ నేను జిమ్ ఫ్రెండ్స్. చాలా మంచి వ్యక్తి. బ్యాగ్రౌండ్ ఉన్నాసరే కష్టం మీద పైకి రావాలనుకుంటున్నాడు. విరాన్ నన్ను అన్నా అంటాడు కానీ నేను విరాన్ని అన్నా అని పిలవాలి. ఈ సినిమా పెద్ద విజయం అందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని విశ్వక్ సేన్ చెప్పాడు. షూటింగ్‌లో బిజీ ఉండి కూడా విశ్వక్ నా కోసం వచ్చారు. నా వెనకే ఉండి సపోర్ట్ చేసే అల్లు అర్జున్, శిరీష్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు అని హీరో విరాన్ చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: బాలీవుడ్‌లో డబ్బులిచ్చి ఆ పని చేయించుకుంటారు: ప్రియమణి)
Comments
Please login to add a commentAdd a comment