ఒక్క అంగుళం కూడా కబ్జా చేయలేదు: నాగార్జున ఎమోషనల్‌ | Nagarjuna Akkineni First Reaction on N Convention Centre Demolition | Sakshi
Sakshi News home page

Nagarjuna Akkineni: అన్యాయంగా కూల్చేశారు.. నాగ్‌ ఆవేదన

Published Sat, Aug 24 2024 1:12 PM | Last Updated on Sat, Aug 24 2024 4:21 PM

Nagarjuna Akkineni First Reaction on N Convention Centre Demolition

సాక్షి, హైదరాబాద్‌: మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతపై హీరో నాగార్జున స్పందించారు. కోర్టు కేసులు, స్టే ఆర్డర్‌లకు విరుద్ధంగా కూల్చివేతలు చేపట్టడం బాధాకరమన్నారు. చట్టానికి వ్యతిరేకంగా తాము ఏ పనులూ చేయలేదని చెప్పడానికే ఈ ప్రకటన జారీ చేస్తున్నట్లు వివరించారు. పట్టా భూమిలోనే కన్వెన్షన్‌ హాల్‌ ఉందని, ఒక్క అంగుళం కూడా కబ్జా చేయలేదని స్పష్టం చేశారు. ఇది ప్రైవేట్‌ స్థలంలో నిర్మించిన భవనం అని, కూల్చివేత కోసం గతంలో ఇచ్చిక అక్రమ నోటీసుపై కోర్టు స్టే కూడా ఇచ్చిందని గుర్తు చేశారు.

ఇది కరెక్ట్‌ కాదు
నేడు చట్టవిరుద్ధంగా తమ భవనాన్ని కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయం కూల్చివేతకు ముందు కూడా తమకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదని తెలిపారు. కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఇలా చేయడం సరికాదన్నారు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే కచ్చితంగా తానే దగ్గరుండి నేలమట్టం చేసేవాడినని తెలిపారు.

తప్పుడు సంకేతాలు
ఇప్పుడు జరిగిన పరిణామాల వల్ల, మేమేదో కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశముందన్నారు. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలన్నదే తమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. కాగా తమ్మిడికుంట చెరువులో మూడున్నర ఎకరాలు కబ్జా చేసి ఎన్‌ కన్వెన్షన్‌ కట్టారని ఆరోపణలు రావడంతో హైడ్రా దాన్ని నేలమట్టం చేసింది. స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడంతో నాగార్జున కోర్టును ఆశ్రయించారు. 

అన్యాయంగా కూల్చేశారు..నాగార్జున ఎమోషనల్

చదవండి: నాగార్జున N కన్వెన్షన్‌ సెంటర్‌ కూల్చివేత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement