సినీ ప్రియులకు బంపరాఫర్.. కేవలం రూ.99 కే టికెట్! | National Cinema Day Offer: Movie Tickets Priced At Just Rs 99 In Multiplex | Sakshi
Sakshi News home page

Movie Tickets: కేవలం రూ.99కే మల్టీప్లెక్స్‌లో టికెట్స్.. ఆ ఒక్కరోజు మాత్రమే!

Published Thu, Oct 12 2023 12:28 PM | Last Updated on Thu, Oct 12 2023 12:37 PM

National Cinema Day Offer movie tickets priced at just Rs 99 In Multiflex - Sakshi

సినీ ప్రియులకు అదిరిపోయే శుభవార్త. ఈనెల 13న జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా  మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బంపరాఫర్ ప్రకటించింది. ఆ ఒక్క రోజు దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్‌ల్లో కేవలం రూ.99 కే టికెట్స్ బుక్‌ చేసుకోవచ్చని తెలిపింది. ఈ సందర్భంగా తమ ఫ్యామిలీతో కలిసి ఇ‍ష్టమైన సినిమాను ఆస్వాదించవచ్చని వెల్లడించింది. అయితే ఈ ఆఫర్ కేవలం ఎంపిక చేసిన నగరాలు, థియేటర్లలో మాత్రమే వర్తిస్తుందని ప్రకటించింది.  ఈ మేరకు ఎంఏఐ(MAI) ట్వీట్ చేసింది. 

అక్టోబర్ 13న శుక్రవారం కావడంతో చాలా సినిమాలు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. జాతీయ సినిమా దినోత్సవాన్ని పురస్కరించుకుని దాదాపు 4 వేల కంటే ఎక్కువ స్క్రీన్‌లలో ఈ అవకాశం కల్పించారు. ఇప్పటికే రిలీజైన సినిమాలతో పాటు శుక్రవారం రిలీజయ్యే చిత్రాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. తక్కువ ధరకే సినిమా చూసే ఒక్కరోజు మాత్రమే. ఈ ఆఫర్ ప్రముఖ థియేటర్లు అయిన పీవీఆర్, ఐనాక్స్, సినీ పోలీస్, మిరాజ్, సిటీప్రైడ్, ఏషియన్, ముక్తా ఏ2, మూవీ టైమ్, వేవ్, ఎం2కే, డిలైట్‍లో రూ.99 కే అందుబాటులో ఉంటాయని తెలిపింది. అయితే ఈ ఆఫర్ కేవలం ఆన్‌లైన్‌లో టికెట్స్ బుక్‌ చేసుకున్న వారికే వర్తిస్తుందని పేర్కొంది.

కాగా.. 2022లో  మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మొదటిసారిగా జాతీయ సినిమా దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించింది. అంతకుముందు సెప్టెంబర్ 16వ తేదీని వేడుకల రోజుగా ప్రతిపాదించగా.. ఆ తర్వాత అది సెప్టెంబర్ 23కి మారింది. గతేడాది జాతీయ సినిమా దినోత్సవం రోజున 6.5 మిలియన్ల మంది ప్రజలు థియేటర్లకు వెళ్లి సినిమా చూశారని వెల్లడించింది. భారతీయ సినీ పరిశ్రమకు ఆ ఏడాదిలో అత్యధికంగా ప్రేక్షకులు హాజరైన రోజుగా నిలిచిందని ప్రెసిడెంట్ కమల్ జియాన్‌చందానీ తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement