
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. ఇప్పటికే ‘వకీల్ సాబ్’ షూటింగ్ పూర్తి చేసుకున్న పవన్ కల్యాణ్.. తాజాగా మరో షూటింగ్‌ను ప్రారంభించారు. పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. మల్టీస్టారర్‌గా వచ్చి మలయాళంలో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియం'కు ఇది రీమేక్‌గా వస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభమైంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా షూటింగ్ స్పాట్‌కు వచ్చారు. పవన్‌తోపాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు. వీరిద్దరికి సంబంధించిన వీడియోని విడుదల చేసింది చిత్ర బృందం. దీంతో ఈ సినిమాకు సంబంచి పవన్ కల్యాణ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవైతున్నాయి. సింపుల్ లుక్ లో మెడలో ఒక ఎర్ర తాడు తో పవన్ కల్యాణ్ కనిపిస్తున్నారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. విభిన్న చిత్రాల దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్నాడు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లేతో పాటు మాటలు అందిస్తున్నాడు. ఇందులో పవన్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అతడిని ఎదురించే వ్యక్తిగా రానా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ఫిదా బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయం పై చిత్రయూనిట్ అంతవరకు క్లారిటీ ఇవ్వలేదు.
Comments
Please login to add a commentAdd a comment