pawan kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కరోనా నుంచి కోలుకున్నాడు. ఇటీవల కరోనా పాజిటీవ్ రావటంతో తన వ్యవసాయక్షేత్రంలో క్వారంటైన్‌కు వెళ్లి, అక్కడే చికిత్స తీసుకున్నాడు. మూడు రోజుల క్రితం పవన్ కల్యాణ్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న డాక్టర్స్ బృందం ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించింది. అందులో నెగెటీవ్ వచ్చిందని జనసేన పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది.
కరోనా తర్వాత పవన్ కొద్దిగా వీక్ గా ఉన్నారని ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు వైద్యబృందం తెలిపింది. తన ఆరోగ్యం కోసం ఆకాంక్షించిన అభిమానులకు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ డాక్టర్ల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment