Hero Prabhas Donates RS 10 Lakh To Bhadradri Sri Seetha Ramachandra Swamy Devasthanam - Sakshi
Sakshi News home page

Prabhas: భద్రాద్రి రాముడికి ప్రభాస్ భారీ విరాళం

Published Sun, May 14 2023 9:07 AM | Last Updated on Sun, May 14 2023 11:02 AM

Prabhas Donates RS 10 Lakh To Bhadradri Devasthanam - Sakshi

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి పాన్‌ ఇండియా స్టార్‌  ప్రభాస్ రూ. 10 లక్షల విరాళం అందించారు. ఈ మేరకు ప్రభాస్ తరపున యూవీ క్రియేషన్స్‌ ప్రతినిధులు  రూ.10 లక్షల చెక్కును భద్రాచలం ఆలయ ఈఓ రమాదేవికి శనివారం అందించారు. అనంతరం ప్రభాస్‌ శ్రీరాముడి పాత్రలో నటించిన ఆదిపురుష్‌ చిత్రం సూపర్‌ హిట్‌ కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మొత్తాన్ని దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత నిత్యాన్నదాన పథకానికి కేటాయించాలని ప్రభాస్‌ సూచించినట్లు తెలుస్తోంది.

(చదవండి: కోపంతో నడిరోడ్డుపై అతడి చెంప పగలగొట్టా.. హీరోయిన్‌)

ఓం రౌత్‌ దర్శకత్వం వహించిన ఆదిపురుష్‌ చిత్రం తర్వలోనే విడుదల కానుంది. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్‌, సీతగా కృతీ సనన్‌ నటించారు. గుల్షన్‌ కుమార్‌, టీ సిరీస్‌ సమర్పణలో భూషణ్‌ కుమార్‌, క్రిష్ణకుమార్‌, ఓం రౌత్‌, ప్రసాద్‌ సుతారియా, రాజేశ్‌ నాయర్‌, వంశీ, ప్రమోద్‌ నిర్మించారు. పాన్‌ ఇండియా మూవీగా వస్తున్న ఈ చిత్రం జూన్‌ 16న రిలీజ్‌ కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement