
బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు చెక్కేసిన స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా పెళ్లికి ముందే అండాలను భద్రపరుచుకుంది. అమెరికన్ సింగర్, నటుడు నిక్ జోనాస్‌ను 2018లో పెళ్లాడిన ఆమె గతేడాది సరోగసి ద్వారా ఆడపిల్లకు జన్మనిచ్చింది. తన గారాలపట్టికి ముద్దుగా మాల్తీ మేరీ అని పేరు పెట్టుకుంది. మాల్తీ క్యూట్ ఫోటోలు, ఆమె ఆడుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరలవుతూనే ఉన్నాయి.
తాజాగా ప్రియాంక చోప్రా తన ఫ్యామిలీతో కలిసి సరదాగా బయటకు వెళ్లింది. ఈ సందర్భంగా పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో ప్రియాంక ముద్దుల తనయ మాల్తీ ఓ బ్యాగుతో ఆడుకుంటున్న ఫోటో జనాలను బాగా ఆకర్షిస్తోంది. సరదాగా ఆ బ్యాగు ధర ఎంతుంటుందని నెట్టింట ఆరా తీసిన నెటిజన్లు దాని ధర తెలిసి ఉలిక్కిపడుతున్నారు. అవును మరి, ఆ బ్యాగు వందల్లోనూ, వేలల్లోనూ లేదు. ఏకంగా లక్షలు పలుకుతోంది.
గ్రీన్ కలర్‌లో ఉన్న ఈ బ్యాగు ధర అక్షరాలా రెండు లక్షల 45 వేలని తెలుస్తోంది. బల్గరీ సెర్పంటి ఫరెవర్ క్రాస్‌బడీ రకానికి చెందిన ఈ కాస్ట్‌లీ బ్యాగు ధర అభిమానులు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. 'భారీగా సంపాదిస్తుంది కనుకే అంతలా ఖర్చు పెడుతోంది', 'రెండున్నర లక్షలు వృధా చేసింది', 'ఈ డబ్బుతో పేదింట పెళ్లి అయిపోతుంది', 'ఈ సెలబ్రిటీలంతా అధిక ధర ఉన్న బ్రాండెడ్ వస్తువులనే వాడతారు, కొందరికి అవి గిఫ్టుగా కూడా వస్తుంటాయి. అంతమాత్రానికి మనం ఇంతలా ఆశ్చర్యపోవడం అవసరం అంటారా?' అని నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: ఆదిపురుష్.. టికెట్ రేట్లు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment