రష్మిక ఒక్క నవ్వు నవ్వితే చాలు.. ఇంకేమింకేమింకేం కావాలే.. చాల్లే ఇది చాలే... అంటూ కుర్రకారు దిల్ ఖుష్ అయిపోతారు. కొంటెగా కన్ను గీటినా, చిలిపిగా ఓ నవ్వు నవ్వినా.. తను ఏం చేసినా అభిమానులకు ఇష్టమే! తెలుగు ప్రేక్షకులకు తొలిసారిగా చలో సినిమాలో కళ్లజోడుతో కనిపించింది. గీతగోవిందంలో హీరోను ముప్పు తిప్పలు పెట్టించింది. తన అల్లరితనం, చలాకీతనం ఇక్కడివారికి భలే నచ్చేసింది. సరిలేరు నీకెవ్వరు మూవీలో కూడా అదే హుషారుతనం.
యానిమల్ మూవీతో విమర్శలు
వెంటనే నేషనల్ క్రష్‌గా తనకంటూ ఓ బిరుదిచ్చేశారు. మధ్యలో కొన్ని ఫ్లాపులు అందుకున్నప్పటికీ పుష్పలో అల్లు అర్జున్ సరసన నటించే ఛాన్స్ అందుకుంది. ఇది పాన్ ఇండియా రేంజ్‌లో హిట్టవడంతో బాలీవుడ్‌లోనూ అవకాశాలు రాగా అక్కడా సినిమాలు చేస్తోంది. ఈ క్రమంలో గతేడాది యానిమల్ మూవీ చేసింది. ఇందులో రష్మిక ఎవరూ ఊహించని పాత్రలో కనిపించింది. భర్తను ప్రాణంగా ప్రేమించే మధ్యతరగతి గృహిణిగా కనిపించింది. భర్త ఎన్ని తప్పులు చేసినా అతడిని వదిలేయడానికి ఆమె మనసు అంగీకరించదు.
ట్రోల్స్ సహించను
ఇలాంటి రోల్ చేసినందుకు రష్మికను ఆడిపోసుకున్నారు. తను సమాజంలో జరుగుతుంది చూపించినప్పటికీ దాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఎట్టకేలకు ఈ ట్రోలింగ్‌పై స్పందించింది రష్మిక. 'అమ్మాయిల శరీరాన్ని ట్రోల్ చేస్తే నేనస్సలు సహించలేను. ఇప్పుడు చాలామంది నన్ను, నా సినిమాలను, డైలాగులు చెప్పేటప్పుడు నా ముఖకవళికలను.. ఇలా ప్రతిదాన్ని ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా యానిమల్‌లో కర్వా చౌత్ సీన్ గురించి విమర్శిస్తున్నారు. సెట్‌లో ఈ సీన్ చేసినప్పుడు అందరూ చప్పట్లు కొట్టారు. సినిమా రిలీజయ్యాక మాత్రం జనాలు తిట్టిపోస్తున్నారు. అయినా నా పర్ఫామెన్స్ ఏంటో నాకు తెలుసు' అని రీసౌండ్ వచ్చేలా కౌంటర్ ఇచ్చింది.
ఎదుగుదలతోనే జవాబు
నిజానికి ఈ సామాజిక మాధ్యమాల వల్ల సెలబ్రిటీల మీద విషం కక్కుతున్నారు. కొందరు దానివల్ల ఎంతో బాధపడుతున్నారు, డిప్రెషన్‌కు లోనవుతున్నారు. కానీ బాధపడుతూ కూర్చుంటే లాభం లేదనుకునే ఇలా ట్రోలింగ్‌ను తిప్పికొట్టింది రష్మిక. నవ్వినా, తుమ్మినా, దగ్గినా తప్పులు తీసే కాలం ఇది.. కాబట్టి ప్రతిసారి నోటితో ఆన్సరివ్వకుండా.. తగ్గేదేలే అన్న రీతిలో తన ఎదుగుదలతోనే ట్రోలింగ్‌కు ధీటైన సమాధానం చెప్తోంది శ్రీవల్లి.
చదవండి: సందీప్, లావణ్య త్రిపాఠి హిట్ సినిమా.. ఏడేళ్ల తర్వాత తెలుగులో విడుదల
పుష్పరాజ్ సతీమణి శ్రీవల్లీ లుక్ చూశారా..?
Comments
Please login to add a commentAdd a comment