బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ తాజా చిత్రం జుండ్ మే 6న ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మార్చి 4న ఈ సినిమా థియేటర్లో విడుదలైంది. అయితే ఈ మూవీ ఓటీటీ విడుదలను ఆపాలంటూ తెలుగు నిర్మాత తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అతడి పిటిషన్‌ను విచారించిన తెలంగాణ హైకోర్టు ఈ మూవీ డిజిటల్ రిలీజ్‌పై స్టే విధించింది.
చదవండి: సినిమాలకు హీరోయిన్ కాజల్ గుడ్‌బై చెప్పనుందా?
హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు కృష్ణ మురారి, హిమ కోహ్లీలతో కూడిన ధర్మాసం ఇవాళ విచారణకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఈ స్టేపై పూర్తి వివరణ ఇవ్వలేదని, కేవలం ఒక లైన్ స్టెట్‌మెంట్ మాత్రమే ఇచ్చిందని సీనియర్ లాయర్ సీఏ సుందరం అన్నారు. దీంతో సుప్రీం కోర్టు ఈ కేసు తదుపరి విచారణను జూన్ 9కి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.
చదవండి: ఉత్కంఠగా సమంత ‘యశోద’ మూవీ ఫస్ట్‌గ్లింప్స్
కాగా హైదరాబాద్‌కు చెందిన నిర్మాత నంది కుమార్ ఏప్రిల్ 29న ఈ మూవీ ఓటీటీ రిలీజ్ ఆపాలంటూ తెలంగాణ హైకోర్టులో పటిషన్ దాఖలు చేశాడు. జుండ్ మూవీ నిర్మాతలు కాపీ రైట్ నిబంధనలను ఉల్లఘించారని నంది కుమార్ తన పిటిషన్‌లో ఆరోపించాడు. కాగా నాగ్‌పూర్‌కు చెందిన ప్రముఖ ఫుట్‌బాల్ కోచ్ విజయ్ బార్సే జీవితం ఆధారంగా డైరెక్టర్ నాగరాజ్ మంజులే ఈ సినిమాను తెరకెక్కించాడు. అంకుశ్, ఆకాష్, రింకు సహా తదితరులు ఈ చిత్రంలో నటించారు.
Comments
Please login to add a commentAdd a comment