Siddharth And Aditi Rao Hydari Spotted In Mumbai, Actor Warns Paparazzi - Sakshi
Sakshi News home page

Siddharth: హీరోయిన్‌తో సిద్దార్థ్‌ షికార్లు.. ఫొటోలు క్లిక్‌మనిపించినవారికి హీరో వార్నింగ్‌

Published Wed, Jul 20 2022 5:57 PM | Last Updated on Wed, Jul 20 2022 6:42 PM

Siddharth and Aditi Rao Hydari spotted in Mumbai. Actor Warns Paps Not To Click Pics - Sakshi

'బొమ్మరిల్లు', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' వంటి ఎన్నో హిట్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని గుర్తింపు సంపాదించుకున్నాడు హీరో సిద్దార్థ్‌. కానీ ఈ మధ్య అతడి సినిమాలేవీ పెద్దగా ఆడటం లేదు. చాలాకాలం తర్వాత మహాసముద్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది సక్సెస్‌ అవలేదు. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్‌ సమయంలో హీరోయిన్‌ అదితి రావు హైదరీతో సిద్దార్థ్‌ లవ్‌లో పడ్డాడంటూ ఆ మధ్య పుకార్లు షికార్లు చేశాయి.

తాజాగా ఇది నిజమేనంటూ మరో వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ముంబైలోని ఓ సెలూన్‌ నుంచి ఇద్దరూ బయటకు వస్తుండగా కెమెరాల కంట పడింది. ఇంకేముందీ.. ఫొటోగ్రాఫర్లు వెంటనే వారిని ఫొటోలు తీస్తూ కెమెరాలు క్లిక్‌మనిపించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సిద్దార్థ్‌.. తనను ఫొటోలు తీయొద్దని హెచ్చరించాడట. 'నేను ఇక్కడివాడిని కాదు, వెళ్లి ఈ ప్రాంతానికి చెందిన వాళ్ల ఫొటోలు తీసుకోండి. నెక్స్ట్‌ టైం మాత్రం ఇంత మర్యాదగా అస్సలు చెప్పను, అర్థమైందా?' అని ఓరకంగా వార్నింగే ఇచ్చాడట.

చదవండి: చిరంజీవిపై అనుచిత వ్యాఖ్యలు.. వెనక్కు తగ్గిన నారాయణ
 క్యాస్టింగ్‌ కౌచ్‌ వల్ల పెద్ద పెద్ద ప్రాజెక్టులు వదులుకున్నా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement