క్షేమంగా ఇంటికి చేరుకున్న గాయని పి.సుశీల.. వీడియో విడుదల | Singer P Susheela Discharge From Hospital | Sakshi
Sakshi News home page

క్షేమంగా ఇంటికి చేరుకున్న గాయని పి.సుశీల.. వీడియో విడుదల

Aug 20 2024 7:45 AM | Updated on Aug 20 2024 8:56 AM

Singer P Susheela Discharge From Hospital

ప్రముఖ గాయని, పద్మభూషణ్‌ గ్రహీత పి.సుశీల పూర్తి ఆరోగ్యంతో ఇంటికి చేరుకున్నారు. తాను క్షేమంగా ఉన్నానంటూ అభిమానుల కోసం తాజాగా ఒక వీడియో విడుదల చేశారు. రెండురోజుల క్రితం ఆమెకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే చెన్నైలోని కావేరి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స తీసుకున్న సుశీల క్షేమంగా ఇంటికి చేరుకున్నారు.

తాజాగా ఇంటికి చేరుకున్న తర్వాత సుశీల తన అభిమానుల గురించి ఇలా చెప్పుకొచ్చారు. 'ఇప్పుడే నేను ఇంటికి చేరుకున్నారు. పూర్తి ఆరోగ్యంతో వైద్యులు నన్ను ఇంటికి పంపించారు. మీ ప్రార్థనలే నన్ను రక్షించాయి. దేవుడిని నమ్మిన వాడు ఎప్పుడూ చెడిపోడు. నన్ను ఆ భగవంతుడు రక్షించినట్లే మిమ్మల్ని అందరినీ కూడా కాపాడుతాడు. నన్ను అభిమానించే వారందరికీ నా కృతజ్ఞతలు. మీరందరూ ఎప్పుడూ చల్లగా ఉండాలి.' అని ఆమె కోరుకున్నారు.

క్షేమంగా ఇంటికి చేరుకున్న సుశీల.. అభిమానుల ఆశీస్సులే తనను కాపాడాయని వీడియోలో చెప్పారు. కావేరి ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది తనను బాగా చూసుకున్నారని ఆమె తెలిపారు. తెలుగుతో పాటు సుమారు పదికి పైగా భాషల్లో 45వేలకు పైగా పాటలు పాడారు. కోట్ల సంఖ్యలు అభిమానులను సుశీల సంపాధించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement