
తెలుగులోని టాప్ యాంకర్లలో శ్రీముఖి ఒకరు. ఇటు బుల్లితెరను, అటు వెండితెరను బ్యాలెన్స్ చేసే ఈ భామ తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకుంది. బిగ్‌బాస్ మూడో సీజన్‌లో పాల్గొని రచ్చరచ్చ చేసిన ఈ రాములమ్మ చివరికి రన్నరప్‌గా బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటే శ్రీముఖి తాజాగా అభిమానులతో చిట్‌చాట్ చేసింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ మరోమారు పెళ్లి ప్రస్తావన తీసుకురాగా తన అభిప్రాయమేంటో నిక్కచ్చిగా చెప్పేసింది.
శ్రీముఖి అభిమానులతో చేసిన చిట్‌చాట్‌లో ఓ నెటిజన్ ఆతృత చూపుతూ.. 'మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు మేడం. చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం' అని ప్రశ్నించాడు. దీనిపై స్పందించిన శ్రీముఖి "ఇప్పట్లో అయితే నేను పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు. మా అమ్మానాన్నల నుంచి కూడా ఎలాంటి ఒత్తిడి లేదు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. కాబట్టి ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచనే లేదు" అని కుండబద్దలు కొట్టేసింది. ఇందులో ఆమె స్పెషల్ ఫిల్టర్లు వాడుతూ చిత్రవిచిత్రంగా కనిపించగా దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్లు వైరల్ అవుతున్నాయి.
చదవండి: శ్రీముఖిలో ఈ టాలెంట్ కూడా ఉందా!
Comments
Please login to add a commentAdd a comment