Tamannaah Bhatia: Bubbly Boxer Movie Launched Deets Here - Sakshi
Sakshi News home page

Tamannaah Bhatia: బౌన్సర్‌ నుంచి మంచి బాక్సర్‌గా తమన్నా!

Feb 19 2022 8:12 AM | Updated on Feb 19 2022 10:26 AM

Tamannaah Bhatia Bubbly Boxer Movie Launched - Sakshi

‘‘బాక్సర్‌ టౌన్‌గా పేరుగాంచిన ఫతేపూర్‌ బ్యాక్‌డ్రాప్‌లో బాక్సింగ్‌ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. మహిళా బౌన్సర్‌ పాత్రలో తమన్నా కనిపిస్తారు. దేశంలో తొలిసారి ఓ మహిళా బౌన్సర్‌ కథ ఆధారంగా వస్తున్న తొలి సినిమా ఇదేనని అనుకుంటున్నాం’’ అన్నారు మధుర్‌ బండార్కర్‌.

బాక్సింగ్‌ రింగులో బాక్సర్‌గా ఫైట్‌ చేసేందుకు రెడీ అయ్యారు తమన్నా. మధుర్‌ భండార్కర్‌ దర్శకత్వంలో రూపొందనున్న ‘బబ్లీ బౌన్సర్‌’ చిత్రంలోనే తమన్నా బాక్సర్‌గా కనిపించనున్నారు. శుక్రవారం ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ‘‘బాక్సర్‌ టౌన్‌గా పేరుగాంచిన ఫతేపూర్‌ బ్యాక్‌డ్రాప్‌లో బాక్సింగ్‌ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. మహిళా బౌన్సర్‌ పాత్రలో తమన్నా కనిపిస్తారు. దేశంలో తొలిసారి ఓ మహిళా బౌన్సర్‌ కథ ఆధారంగా వస్తున్న తొలి సినిమా ఇదేనని అనుకుంటున్నాం’’ అన్నారు మధుర్‌ బండార్కర్‌.

‘‘కెరీర్‌లో తొలిసారి బౌన్సర్‌ పాత్రలో కనిపించనుండటం హ్యాపీగా ఉంది. ఓ చాలెంజ్‌గా తీసుకుని ఈ సినిమాను అంగీకరించాను. ఈ సినిమాతో ప్రేక్షకులు నన్ను మరింతగా ఆదరిస్తారని నమ్ముతున్నాను’’ అన్నారు తమన్నా. అయితే కథ బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది కాబట్టి ఈ చిత్రంలో బౌన్సర్‌ నుంచి ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా ఎదిగే పాత్రలో తమన్నా కనిపిస్తారని  బీ టౌన్‌ టాక్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement