గ్లామర్‌కే ఓటేస్తున్న తమన్నా.. కారణం ఇదేనట! | Tamannaah Bhatia Votes Glamour, Here's The Reason | Sakshi
Sakshi News home page

కావాలయ్యా.. సాంగ్‌పై దారుణ ట్రోల్స్‌.. మైండ్‌సెట్‌ మారాలన్న మిల్కీబ్యూటీ

Published Tue, Apr 2 2024 11:12 AM | Last Updated on Tue, Apr 2 2024 11:40 AM

Tamannaah Bhatia Votes Glamour, Here's The Reason - Sakshi

గ్లామరస్‌గా నటించాలంటే నేటి కథానాయికల్లో తమన్నా తరువాతే ఎవరైనా అని చెప్పవచ్చు. సుమారు 20 ఏళ్ల క్రితం చాంద్‌ సా రోషన్‌ అనే హిందీ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయిన ఈ బ్యూటీ ఆ తరువాత దక్షిణాది చిత్రాలపై దృష్టి పెట్టారు. హిందీలో పెద్దగా పేరు తెచ్చుకోలేకపోయినా, తెలుగు, తమిళం భాషల్లో అగ్రనటిగా రాణిస్తున్నారు. అయితే ఆది నుంచి తమన్నా గ్లామర్‌నే నమ్ముకున్నారని చెప్పవచ్చు.

నువ్వు కావాలయ్యా..
అలాగని ఈ అమ్మడిలో నటించే సత్తా లేదని చెప్పలేం. బాహుబలి వంటి చిత్రాల్లో నటిగా తానేమిటో నిరూపించుకున్నారు. అయినా గ్లామర్‌ క్వీన్‌గానే ముద్ర వేసుకున్నారు. ఇటీవల జైలర్‌ చిత్రంలో నువ్వు కావాలయ్యా పాటలో తనదైన స్టైల్‌లో అందాలను ఆరబోసారు. ఈ పాట ఇప్పటికీ వాడవాడల్లో మారు మోగుతోందంటే అతిశయోక్తి కాదు. తమన్నా తమిళంలో నటించిన తాజా చిత్రం అరణ్మణై –4. ఇందులో అభినయం, అందాలతో ప్రేక్షకులను అలరించడానికి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

మైండ్‌సెట్‌ మారాలి
ఈ సందర్బంగా ఈ చిత్రంలో ఎక్కువ గ్లామరస్‌గా నటించడానికి కారణం ఏమిటన్న ప్రశ్న ఎదురైంది. దీనిపై మిల్కీ బ్యూటీ స్పందిస్తూ.. గ్లామర్‌ను ప్రదర్శించడం, అలాంటి పాటల్లో నటించడం అనేది ప్రేక్షకులకు వినోదాన్ని అందించడమేనన్నారు. ఇంకా చెప్పాలంటే పాటల్లో గ్లామర్‌ను ప్రదర్శించడం తప్పేమీ కాదన్నారు. ఈ విషయంలో ప్రేక్షకుల మైండ్‌సెట్‌ మారాలన్నారు. జైలర్‌ చిత్రంలో కావాలయ్యా పాటను చూసిన కొందరు చాలా దారుణంగా కామెంట్స్‌ చేశారని, అది తనను ఆశ్చర్యానికి గురి చేసిందని పేర్కొన్నారు.

చదవండి: అవార్డును వేలం వేసిన విజయ్‌ దేవరకొండ.. దక్కించుకున్నది ఎవరంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement