
హీరోలు దర్శకులుగా చేయడం, దర్శకులు హీరోలుగా మారడం చిత్ర పరిశ్రమలో సాధారణంగా జరిగేదే. తాజాగా కోలీవుడ్‌లో మరో దర్శకుడు కథానాయకుడిగా సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.
జయం రవి, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటించిన కోమాళి వంటి విజయవంతమైన చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రదీప్ రంగనాథన్ తాజాగా హీరోగా చేయనున్నాడు. ఏజేఎస్ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతూ దర్శకత్వ బాధ్యతలనూ నిర్వహించనున్నాడు. ఈ విషయాన్ని ఆసంస్థ అధినేతలు సోమవారం అధికారికంగా ప్రకటించారు. ఇందులో నటించే నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment