హారర్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా 'రా రాజా'.. టీజర్‌తోనే భయపెట్టారు! | Tollywood Movie Raa Raja Teaser Out Now | Sakshi
Sakshi News home page

Raa Raja Teaser: హారర్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా 'రా రాజా'.. టీజర్‌తోనే భయపెట్టారు!

Published Mon, Jun 17 2024 5:43 PM | Last Updated on Mon, Jun 17 2024 5:43 PM

Tollywood Movie Raa Raja Teaser Out Now

సుగి విజయ్, మౌనిక మగులూరి జంటగా నటించిన చిత్రం 'రా రాజా'. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్‌పై శివప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ చేతుల మీదుగా టీజర్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని ఫుల్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ..'రా రాజా సినిమా టీజర్ లాంచ్ చేయడం ఆనందంగా ఉంది . డైరెక్టర్ కథ చెబుతున్నంత సేపు చాల ఆసక్తిగా అనిపించింది. ఇందులో నటించిన ఇరవై నాలుగు క్యారెక్టర్స్ ఎవరి మొహాలు కనిపించకపోవడం అద్బుతం. ఏఐ జనరేషన్‌లో కూడా అసలు మొహాలు కనిపించకుండా సినిమా ఎలా తీశారు. ఆ ఒక్క రీజన్ కోసం అయినా త్వరగా చూడాలని ఎదురు చూస్తున్నాను. ఈ సినిమా కచ్చితంగా  ట్రెండ్ సెట్ చేస్తుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్' అని అన్నారు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement