బుల్లితెర నటి అంజుమ్ ఫఖీ బ్రేకప్ బాధలో మునిగిపోయింది. రెండేళ్లుగా మార్కెటింగ్ ప్రొఫెషనల్ రోహిత్ జాదవ్‌తో ప్రేమలో ఉన్న ఆమె అతడితో తెగదెంపులు చేసుకున్నట్లు తెలుస్తోంది. మొన్నటివరకు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ జంట ఈ నెలలో కూడా కలిసి ట్రిప్‌కు వెళ్లిందట, ఏమైందే ఏమో కానీ అక్కడే ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారని సమాచారం.
ఒకరినొకరు అన్‌ఫాలో
ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో ఈ ఊహాగానాలు మరింత బలపడుతున్నాయి. అంతేకాదు తన సోషల్ మీడియా ఖాతాలోనూ రోహిత్‌తో కలిసి దిగిన ఫోటోలన్నింటినీ డిలీట్ చేసింది నటి. దీంతో ఈ జంట బ్రేకప్ వార్త నిజమేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
చివరి శ్వాస వరకు చేయి వదలను..
కాగా అంజుమ్.. రోహిత్‌ను ఎంతగానో ప్రేమించింది. అతడిపై తన ప్రేమను వెల్లడిస్తూ గతంలో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. 'జీవితాంతం నీ భాగస్వామిగా ఉంటానని మాటిస్తున్నాను. చివరి శ్వాస వరకు నీ చేయి వదలను. నీ పేరును నా గుండెపై పచ్చబొట్టు వేయించుకున్నాను' అని రాసుకొచ్చింది. మరి రోహిత్‌ను అంతగా ప్రేమించిన నటి మనసు ఎందుకు ముక్కలైంది? వీరి బ్రేకప్‌కు గల కారణాలేంటన్నది తెలియాల్సి ఉంది.
సీరియల్స్ ద్వారా గుర్తింపు
కాగా ఈ నటి మహి వే సీరియల్‌తో తన కెరీర్ ఆరంభించింది. ఏక్ త రాజా ఏక్‌తీ రాణి, కుండలీ భాగ్య, బడే అచ్చే లగ్తే హై 2 సీరియల్స్‌లో నటించింది. ఫియర్ ఫ్యాక్టర్:ఖత్రోన్ కె ఖిలాడీ 13వ సీజన్‌లోనూ పాల్గొంది. ప్రస్తుతం దబాంగి-ముల్గి ఆయూరే ఆయి సీరియల్‌లో నటిస్తోంది.
చదవండి: పిచ్చిపట్టిందా? ఎందుకిలా చేస్తున్నావ్? అని ఆ స్టార్ హీరోను నిలదీశా..
Comments
Please login to add a commentAdd a comment