ఒక్క పాటతో ఫేమస్ అయిన సింగర్స్ చాలామంది ఉన్నారు. వాళ్లలో శ్రీ లలిత కూడా ఒకరు. 'వరహారూపం' పాటతో యూట్యూబ్‌లో సెన్సేషన్ సృష్టించిన ఈమె.. ఇప్పుడు నిశ్చితార్థం చేసుకుని సర్‌ప్రైజ్ చేశారు. తనకు కాబోయే వ్యక్తిని కాస్త డిఫరెంట్‌గా అందరికీ పరిచయం చేశారు. ఓ పాటతో వెల్కమ్ చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
'కాంతార' సినిమా పేరు చెప్పగానే క్లైమాక్స్‌లో వచ్చే 'వరహారూపం' పాటనే గుర్తొస్తుంది. ఒరిజినల్‌గా పాడిన సింగర్ ఎవరో మనకు పెద్దగా తెలియదు గానీ ఇదే గీతాన్ని తనదైన శైలిలో పాడి ఆకట్టుకుంది సింగర్ శ్రీ లలిత. దాదాపు ఏడాది క్రితం యూట్యూబ్‌లో వీడియో పోస్ట్ చేయగా.. దాదాపు 8.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇలా ఒక్క పాటతో ఈమె తెలుగులో చాలా ఫేమ్ సంపాదించారు. ఇప్పుడు ఈమెనే సీతారామ్ అనే వ్యక్తితో నిశ్చితార్థం చేసుకుంది.
(ఇదీ చదవండి: వీడియో: గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్)
'జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు
రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు
ఆనాడు ఎవరూ.. అనుకోనిది..
ఇనాడు మనకు.. నిజమైనది..
ఆ రామాయణం...మన జీవన పారాయణం' అని చెబుతూ తనకు కాబోయే వాడిని నెటిజన్లకు శ్రీ లలిత పరిచయం చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ ఆమె ఫాలోవర్స్‌ని ఆకట్టుకుంటోంది.
ఇకపోతే శ్రీ లలిత కుటుంబానికి సంగీత నేపథ్యమే. తాత ముత్తాతలు సంగీత విద్వాంసులే. ఈమె తల్లిదండ్రులు కూడా గాయకులే. మూడున్నరేళ్ల వయసులోనే ఓ స్టేజీ మీద పద్యం చెప్పమని అడిగితే.. 'లింగాష్టకం' పాడి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. లిటిల్ చాంప్స్, పాడుతా తీయగా, బోల్ బేబీ బోల్, స్వరాభిషేకం.. ఇలా 15కి పైగా రియాలిటీ షోల్లో శ్రీ లలిత పాల్గొంది. ఎంఏ మ్యూజిక్ పూర్తి చేసిన ఈమె... తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ పాటలు పాడటం విశేషం.
(ఇదీ చదవండి: చిరు, పవన్ సినిమాల వల్ల అన్యాయం.. ప్రముఖ నటుడు ఆవేదన)
Comments
Please login to add a commentAdd a comment