బాలీవుడ్‌లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తనకంటూ గుర్తింపు పొందిన నటుల్లో ఒకరు విక్కీ కౌశల్. లస్ట్ స్టోరీస్, రాజీ, సంజు వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసి అనంతరం హీరోగా మారాడు. ‘ఉరీ: ది సర్జికల్ స్ట్రైక్’తో ఒక్కసారిగా సంచలన హిట్ కొట్టి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘సర్దార్ ఉద్దం’. సూజిత్ సర్కార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ అక్టోబర్ 16న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. గతేడాదే విడుదల కావాల్సిన ఈ మూవీ కోవిడ్ నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చింది. త్వరలో ఓటీటీలో రిలీజ్‌కి సిద్ధమయ్యిన ఈ సినిమా ట్రైలర్ సెప్టెంబరు 30న విడుదలయింది.
ఆ ట్రైలర్ చూస్తే అందులో నటుడి ముఖంపై గాట్లు కనపడతాయి. మామూలుగా అయితే వాటిని చూసి ఎవరైన సినిమాలో క్యారెక్టర్ కోసం పెట్టినవి అనుకుంటాం కానీ అవి నిజమైనని విక్కీ తెలిపాడు. సినిమా గురించి యంగ్ హీరో మాట్లాడుతూ.. ‘2019లో ‘ది బూత్ హంటెడ్ షిప్’ అనే సినిమా చేశాను. అందులో భాగంగా తీసిన ఓ సీన్‌లో అనుకోకుండా ఓ డోర్ ఫేస్‌పై పడింది. దీంతో గాయమై 13 కుట్లు పడ్డాయ’న్నాడు. కాగా 1919లో అమృత్‌సర్‌లో ఉన్న జలియన్ వాలాబాగ్‌లో జరిగిన కాల్పుల్లో ఎంతోమంది ప్రాణాలు కొల్పోయారు. దానికి ప్రతీకారంగా స్వాతంత్ర్య సమరయోధుడు ఉద్దం సింగ్ తన ఐడెంటీటీ మార్చుకుని లండన్‌కి వెళ్లి, కాల్పులకు కారణమైన మైకేల్ ఓ డయ్యర్ హత్య చేశాడు. ఆయన జీవిత ఆధారంగానే ‘సర్దార్ ఉద్దం’ సినిమాని తెరకెక్కిస్తున్నారు. షాన్ స్కాట్, స్టీఫెన్ హొగన్, బనితా సంధు, కిర్సీ అవెర్టన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment