ఆ హీరోతో 15ఏళ్ల తర్వాత నటిస్తున్న త్రిష | Vijay And Trisha Krishnan Come Together For Thalapathy 67 | Sakshi
Sakshi News home page

Trisha Krishnan: ఆ హీరోతో 15ఏళ్ల తర్వాత నటిస్తున్న త్రిష

Feb 2 2023 8:33 AM | Updated on Feb 2 2023 8:43 AM

Vijay And Trisha Krishnan Come Together For Thalapathy 67 - Sakshi

దాదాపు పదిహేనేళ్ల తర్వాత జోడీ కట్టారు హీరో విజయ్‌–హీరోయిన్‌ త్రిష. మహేశ్‌బాబు ‘ఒక్కడు’ తమిళ రీమేక్‌ ‘గిల్లి’ (2004)లో తొలిసారి జోడీ కట్టారు విజయ్, త్రిష. ఆ తర్వాత ‘తిరుచ్చి’(2005), (తెలుగులో ‘అన్నవరం’గా రీమేక్‌ అయ్యింది) తెలుగు ‘అతనొక్కడే’కు తమిళ రీమేక్‌ ‘ఆది’ (2006), ‘కురివి’ (2008) సినిమాల్లో జంటగా నటించారు. తాజాగా విజయ్‌ కెరీర్‌లో 67వ త్రంగా తెరకెక్కుతున్న మూవీలో త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న విషయాన్ని చిత్ర యూనిట్‌ ప్రకటింంది.

దీంతో విజయ్, త్రిష ఐదోసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నట్లవుతుంది. ‘మాస్టర్‌’ తర్వాత హీరో విజయ్, దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ఇది. సంజయ్‌ దత్, ప్రియాఆనంద్, అర్జున్‌ సర్జా, గౌతమ్‌ మీనన్‌ కీలక పాత్రలు  పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనిరుద్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement