Vijay Deverakonda and Samantha's Kushi earns ₹90 crore from Non-theatrical Rights
Sakshi News home page

Khushi Movie: విజయ్-సమంత జోడీ.. భారీ ధరకు నాన్ థియేట్రికల్ రైట్స్..!

Published Wed, Nov 9 2022 3:04 PM | Last Updated on Wed, Nov 9 2022 3:32 PM

Vijay Devarakonda and Samantha Movie Khushi Non Theatrical Rights - Sakshi

లైగర్ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత జంటగా నటిస్తున్న చిత్రం 'ఖుషి'. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన నాన్-థియేట్రికల్ బిజినెస్ భారీస్థాయి ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. లైగర్ డిజాస్టర్ ఈ మూవీపై ఎలాంటి ప్రభావం చూపలేనట్లు కనిపిస్తోంది. ఈ సినిమాతోనైనా విజయ్ హిట్ కొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు. 

ఈ సినిమాకు అన్ని భాషల్లో కలిపి నాన్- థియేట్రికల్ రైట్స్ రూ.90 కోట్లకు పైగా అమ్ముడైనట్లు సమాచారం. లైగర్ ఫ్లాప్ అయ్యాక ఇంత పెద్ద మొత్తంలో పలకడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విజయ్ దేవరకొండ, సమంత జోడీగా వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కశ్మీర్ నేపథ్యంలో సాగే ఈ ప్రేమ కథ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా మూడు షెడ్యూల్స్ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హీషమ్ సంగీతం అందిస్తున్నారు. లైగర్‌తో ఢీలా పడ్డ విజయ్‌కి ఈ సినిమా ఎలాంటి టాక్ తీసుకొస్తుందో వేచి చూడాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement