Vivek Dahiya says he was linked up to Divyanka Tripathi - Sakshi
Sakshi News home page

Vivek Dahiya: 'లవ్ ఏం లేదు.. నేరుగా డేటింగ్ ఆ తర్వాత పెళ్లి'

Published Wed, Jun 21 2023 10:45 AM | Last Updated on Wed, Jun 21 2023 11:16 AM

Vivek Dahiya Dating Marriage Divyanka Tripathi - Sakshi

నటీనటులు ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడం కొత్త విషయమేం కాదు. అన్ని ఇండస్ట్రీలోనూ ఇలా జరుగుతున్నాయి. ఈ మధ్యనే మెగాహీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. గత ఏడేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. ఇప్పుడు బాలీవుడ్ కి చెందిన ఓ నటుడు.. లవ్ ఏం లేకుండానే సహనటిని డేటింగ్ చేసి పెళ్లి చేసుకున్నానని చెప్పుకొచ్చాడు. ఇప్పుడీ విషయం కాస్త ఆసక్తికరంగా అనిపించింది.

బాలీవుడ్ లో సినిమాలతో పాటు సీరియల్స్ కి క్రేజ్ ఎక్కువే. అలా బుల్లితెరపై క్రేజ్ సంపాదించిన వాళ్లలో వివేక దహియా, దివ్యాంక త్రిపాఠి కూడా ఉంటారు. వీళ్లిద్దరూ ఎప్పుడు ఫొటోలు పోస్ట్ చేసినా సరే మోస్ట్ లవ్లీ కపుల్ అని అందరూ తెగ కామెంట్స్ పెడుతుంటారు. వీళ్లిద్దరిదీ లవ్ మ్యారేజ్ అని చాలామంది భ్రమ పడుతుంటారు. కానీ తమ మధ్య లవ్ ఏం లేకుండా నేరుగా పెళ్లి చేసుకున్నామని వివేక్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. 

(ఇదీ చదవండి: మెగా ఫ్యామిలీకి సెంటిమెంట్‌గా మారుతున్న ఆ పేరు!?)

'మేం కలిసి నటించాం. ఫ్రెండ్‌షిప్ కి కూడా అస్సలు టైం లేదు. దీంతో నేరుగా డేటింగ్ మొదలుపెట్టేశాం. మా ఇద్దరినీ ఎవరో లింక్ చేయడమే ఇందుకు కారణం. లేదంటే మా మధ్య లవ్ అనే యాంగిల్ ఉండేది కాదు. మమ్మల్ని ఒకరికొకరికి పరిచయం చేసింది వాళ్లు. ఓ రకంగా మాది అరేంజ్ మ్యారేజ్ అనుకోవచ్చు. నా ఫ్రెండ్, సహనటుడు పంకజ్ భాటియా ఓసారి.. 'ఆమె(దివ్యాంక) నీకు జోడీగా ఫెర్ఫెక్ట్' అని అన్నాడు. నేనేమో పెళ్లి చేసుకోనని అతడితో అన్నాను. ఆ తర్వాత అలా జరిగిపోయింది' అని నటుడు వివేక్ దహియా చెప్పుకొచ‍్చాడు. 

వివేక్-దివ్యాంక.. 'హే హై మొహబత్తిన్' సీరియల్ లో కలిసి నటించారు. ఈ షూటింగ్ టైంలోనే డేటింగ్ మొదలుపెట్టారు. ఇది జరిగిన కొన్నాళ్లకు అంటే 2016 జనవరి 16న నిశ్చితార్థం చేసుకున్నారు. అదే ఏడాది జూలై 8న భోపాల్ లో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఎవరికి వాళ్లు వర్క్ పరంగా బిజీగానే ఉన్నారు. అప్పుడప్పుడు టూర్స్ కి వెళ్తూ కలిసి తీసుకున్న ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ ని ఎంటర్ టైన్ చేస్తున్నారు. 

(ఇదీ చదవండి: మేనేజర్ మోసం.. రష్మిక షాకింగ్ నిర్ణయం!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement