బిగ్ బాస్ రియాలిటీ షో అభిమానులను ఓ రేంజ్‌లో అలరిస్తోంది. దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ ఈ షో విజయవంతంగా కొనసాగుతోంది. హిందీలో ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ -17 నడుస్తోంది. ఈ రియాలిటీ షోకు స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ వారంలో బిగ్ బాస్ ఊహించని షాకిచ్చారు. గత వారంలోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినట్లు సల్మాన్ ఖాన్ ప్రకటించారు.
బిగ్ బాస్ సీజన్- 17లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ మనస్వి మామ్‌గాయ్ గత వారంలోనే ఎంట్రీ ఇచ్చారు. ఈ సీజన్‌లో సోనియా బన్సాల్ తర్వాత ఎలిమినేట్ అయిన రెండో కంటెస్టెంట్‌గా మానస్వి నిలిచింది. 'బిగ్ బాస్ హౌస్‌లో మానస్వి చాలా బాగా ఆడారు.. కానీ ఎలిమినేట్ కాక తప్పడం లేదు' అంటూ సల్మాన్ ఖాన్ ప్రకటించారు. ఈ వారం నామినేట్ అయినవారిలో సమర్థ్ జురెల్, ఇషా మాల్వియా, అరుణ్ మాశెట్టి, సనా రయీస్ ఖాన్ సేఫ్ అయ్యారు.
#ManasviMamgai jaayengi Bigg boss ke ghar se wapas apne ghar. Let’s say goodbye. 😟#BB17 #BiggBoss17 #BiggBoss
— ColorsTV (@ColorsTV) November 4, 2023
@BeingSalmanKhan #WeekendKaVaar pic.twitter.com/0a0omnWgVc
Comments
Please login to add a commentAdd a comment