వరంగల్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు – 2023 నేపథ్యంలో టీపీసీసీ అనుబంధ కమిటీలను ఆ పార్టీ హైకమాండ్ శనివారం సాయంత్రం ప్రకటించింది. ఎన్నికల మేనేజ్‌మెంట్, మెనిఫెస్టో ఏఐసీసీ కార్యక్రమాల అమలు, చార్జ్‌షీట్, ట్రైనింగ్, స్ట్రాటజీ తదితర కమిటీల్లో ఉమ్మడి వరంగల్‌కు చెందిన పలువురు సీనియర్లకు అవకాశం దక్కింది. దామోదర రాజనర్సింహ చైర్మన్‌గా 9 మందితో వేసిన ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీలో నమిండ్ల శ్రీనివాస్‌కు అవకాశం దక్కింది.
మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చైర్మన్‌గా 24 మందితో వేసిన కాంగ్రెస్ రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టో కమిటీలో ఆయనతో పాటు ఐదుగురికి అవకాశం కల్పించారు. సభ్యులుగా టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కేంద్రమాజీ మంత్రి పోరిక బలరాం నాయక్, కూచన రవళిరెడ్డి, ప్రొఫెసర్ కె.వెంకటస్వామిల పేర్లు ఉన్నాయి. 10మంది సభ్యులతో ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీకి కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్‌కు చైర్మన్ పదవి దక్కింది.
అదేవిధంగా 14 మందితో వేసిన చార్జ్‌షీట్ కమిటీలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, బెల్లయ్యనాయక్‌లు ఉన్నారు. 17మంది సభ్యులతో వేసిన ట్రైనింగ్ కమిటీకి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ను చైర్మన్‌గా నియమించారు. కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు చైర్మన్‌గా 13 మంది సభ్యులు గల స్ట్రాటజీ కమిటీలో సింగాపురం ఇందిరకు అవకాశం దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment