ప్రభుత్వ బడులను అన్నివిధాలా తీర్చిదిద్దుతాం | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ బడులను అన్నివిధాలా తీర్చిదిద్దుతాం

Published Mon, May 20 2024 4:50 AM

ప్రభుత్వ బడులను అన్నివిధాలా తీర్చిదిద్దుతాం

కొల్లాపూర్‌ రూరల్‌/పెంట్లవెల్లి: ప్రభుత్వ పాఠశాలలను అన్నివిధాలా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొల్లాపూర్‌ మండలం సింగోటం, పెంట్లవెల్లి మండలంలోని కొండూరు పాఠశాలలను పరిశీలించి, సమస్యలను తెలుసుకున్నారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పించి, మెరుగైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. గురుకులాల్లో సీట్ల కోసం ఏవిధంగా పోటీపడతారో అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో సీట్ల కోసం విద్యార్థులు వచ్చేలా అభివృద్ధి చేస్తామన్నారు. తాను చదువుకున్న పెద్దమారూర్‌, కొండూరు, సింగోటం గ్రామాల్లో ప్రభుత్వ బడులను మోడల్‌ స్కూల్స్‌గా మార్చేందుకు కృషిచేస్తానని అన్నారు. ప్రజలు సంపాదించిన డబ్బంతా పిల్లల చదువుకు వెచ్చిస్తున్నారని.. కార్పొరేట్‌ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు ఉంటే స్థానికంగానే పిల్లలను చేర్పిస్తారన్నారు. ఆ దిశగా ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఉదయం 7 గంటల నుంచే విద్యార్థులకు విద్యాబోధన చేసేలా వలంటీర్లను ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా ఆటలు, పాటలు, వివిధ కళల్లో విద్యార్థులు రాణించేలా ప్రోత్సాహం అందిస్తామన్నారు. కొల్లాపూర్‌ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దిడమే తన లక్ష్యమన్నారు. మంత్రి వెంట కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు మధుగాం నర్సింహయాదవ్‌, మాజీ సర్పంచులు వెంకటస్వామి, నల్లపోతుల గోపాల్‌, ధర్మతేజ, రాము, శ్రీను, కురుమయ్య, రవి, నరసింహనాయుడు, బాలరాజు, రాచూరి శివ ఉన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement