
రిజిస్ట్రేషన్ సమయంలోనే.. క్రమబద్ధీకరణ
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం..
● గత ప్రభుత్వ హయాంలో 2020 ఆగస్టు 26న అక్రమ లేఅవుట్లకు రిజిస్ట్రేషన్లు నిలిపివేసింది. ప్లాటుకు ఏదైనా లింకు డాక్యుమెంట్ లేదంటే ఒకసారి విక్రయించి ఉంటే రిజిస్ట్రేషన్‌కు అనుమతి ఇచ్చింది.
● అక్రమ, అనధికారిక ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవడానికి ఎల్‌ఆర్‌ఎస్ అవకాశం ఇచ్చారు. నిర్ణీత మొత్తాన్ని చెల్లిస్తే క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.
● 2020 కంటే ముందు అక్రమ లే అవుట్‌లో 10 శాతం రిజిస్ట్రేషన్ అయి ఉంటే మిగిలిన ప్లాట్లకు తాజాగా రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారు. ఆ ప్లాట్లకు స్టాంపు డ్యూటీ, ఎల్‌ఆర్‌ఎస్ రుసుం రెండు రకాలుగా ఆదాయం సమకూరనుంది.
అచ్చంపేట: ఇప్పటి వరకు ఎల్‌ఆర్‌ఎస్ లేకుండానే ప్లాట్లను విక్రయించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టనుంది. ఇకపై రిజిస్ట్రేషన్‌కు వచ్చే ప్రతి ప్లాట్‌కు లే అవుట్ల క్రమబద్ధీకరణ చేయాలని నిర్ణయించింది. ఒకవేళ చేసుకోలేకపోతే అనుమతి నిరాకరిస్తారు. ప్లాట్‌లో కొంత భాగం ఇప్పటికే విక్రయించినా.. మిగతాది ఎల్‌ఆర్‌ఎస్ చేసుకునేలా వెసులుబాటు ఇచ్చారు. జిల్లాలోని ఆయా మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామాల్లో అనుమతి లేకుండానే అనధికారక లేఅవుట్లతో ఆదాయం రాకుండాపోతుంది. భవిష్యత్‌లో మౌలిక వసతులు కల్పించేందుకు, పట్టణాభివృద్ధికి భారంగా మారుతోంది. ప్లాట్లు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భూ యజమానులు మాత్రం సౌకర్యాలు కల్పించకుండా ఆదాయం వెనకేసుకుంటున్నారు.
వారికి 25 శాతం రాయితీ
రిజిస్ట్రేషన్ శాఖలో దరఖాస్తు చేయగానే ఎప్పటిలాగే మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు ప్లాట్ల వివరాలు ఆన్‌లైన్‌లో వెళ్తాయి. ఆ ప్లాట్ ఎల్‌ఆర్‌ఎస్ చేసేందుకు వీలుందో.. లేదో పరిశీలిస్తారు. క్షేత్రస్థాయిలో లెవల్–1, తర్వాత లెవల్–2, లెవల్–3లో అధికారులు పరిశీలించిన తర్వాత రిజిస్ట్రేషన్ కార్యాలయ లాగిన్‌లోకి తిరిగి పంపిస్తారు. ఒకవేళ ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తు తిరస్కరిస్తే ప్లాటు యాజమాని ముందుగా చెల్లించిన రుసుంలో 10 శాతం చార్జీల కింద పట్టుకొని మిగతా మొత్తాన్ని దరఖాస్తుదారులకు చెల్లిస్తారు. రానున్న రోజుల్లో క్రమబద్ధీకరించని భూములకు ఎలాంటి రిజిస్ట్రేషన్, నిర్మాణాలకు అనుమతి ఇవ్వబోమని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ నెల 31లోగా ప్రభుత్వం కల్పించిన 25 శాతం రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
మొబైల్ ద్వారా..
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులు క్రమబద్ధీకరణకు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. సాంకేతిక అవగాహన కలిగి, స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్ అందుబాటులో ఉండే వారు ఇంటి నుంచే ఫీజు చెల్లించవచ్చు. గూగుల్ సెర్చ్‌లో ఎల్‌ఆర్‌ఎస్ 2020 అని టైప్ చేస్తే అక్కడ వెల్‌కం టు లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం వస్తోంది. దానిపై క్లిక్ చేస్తే తెలంగాణ జీఓవీ ఇన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ హోం పేజీలో సిటిజన్ లాగిన్‌ను ఎంచుకోవాలి. అందులో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తు సమయంలో మనం ఇచ్చిన ఫోన్ నంబరును నమోదు చేయాలి. ఓటీపీ నంబరు అడుగుతోంది. మీసెల్‌కు వచ్చిన ఓటీపీ నమోదు చేసి వ్యాలిడెట్ చేసుకోవాలి. వివరాలు పరిశీలించుకున్న తర్వాత ప్రొసీడ్ క్లిక్ చేస్తూ అన్ని అంశాలను అంగీకరిస్తూ పేమెంట్ బటన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ క్యూఆర్ కోడ్‌ను చూపించే బటన్‌ను నొక్కి ఫోన్ నంబరు నమోదు చేసిన తర్వాత కంటిన్యూ అండ్ పే క్లిక్ చేయగానే ఫోన్‌పే, గూగుల్ పే ఆధారంగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. పేమెంట్ అనంతరం రసీదు డౌన్‌లోడ్ చేసుకోవాలి.
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో ఇలా..
సద్వినియోగం చేసుకోవాలి
అనధికారిక లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులు ప్రభుత్వం కల్పించిన 25 శాతం రాయితీని సద్వినియోగం చేసుకోవాలి. ఈ నెల 31 వరకు మున్సిపల్ కార్యాలయంలోని ఎల్‌ఆర్‌ఎస్ హెల్ప్‌డెస్క్‌లో కానీ, సెల్, కంప్యూటర్ ద్వారా కానీ ఫీజు చెల్లించే వెసులుబాటు ఉంది. ఏమైనా సందేహాలు ఉంటే మున్సిపల్ కార్యాలయంలో స్వయంగా కానీ సెల్‌నం.80086 64194కు ఫోన్ చేసి కాని తెలుసుకోవచ్చు. – యాదయ్య,
మున్సిపల్ కమిషనర్, అచ్చంపేట
ఎల్‌ఆర్‌ఎస్ లేకపోతే అనుమతుల నిలిపివేతకు నిర్ణయం
భవిష్యత్‌లోనూ ఇవ్వబోమని తేల్చిచెప్పిన ప్రభుత్వం
నెలాఖరులోగా చెల్లించే వారికి 25 శాతం రాయితీ
జిల్లావ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులు 44,137

రిజిస్ట్రేషన్ సమయంలోనే.. క్రమబద్ధీకరణ