సూర్యాపేట : నాటి వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకు ఘన చరిత్ర సూర్యాపేట సొంతం. ఈ నియోజకవర్గ ఓటర్లు బీజేపీ మినహా అన్ని పార్టీలను ఆదరించారు. 1952లో నియోజకవర్గ ఏర్పాటులో అప్పటి రైతాంగ పోరాటంలో ప్రత్యేక గుర్తుంపు పొందిన ప్రాంతంగా పేరు పొందిన సూర్యాపేటలో వరుసగా నాలుగుసార్లు పీడీఎఫ్‌ను ఆదరించారు. ఒకసారి సీసీఐని గెలిపించారు. మరోసారి సీపీఎంను గెలిపించి కమ్యూనిస్టుల కంచుకోట సూర్యాపేట అనేలా తీర్పునిచ్చారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో రెండు పర్యాయాలు కాంగ్రెస్ అభ్యర్థులకు పట్టం కట్టారు. 1983 తరువాత రాజకీయాల్లో వచ్చిన మార్పుల వల్ల వరుసగా నాలుగుసార్లు టీడీపీని గెలిపించారు. టీడీపీ పట్టుకోల్పోవడంతో తిరిగి మూడుసార్లు కాంగ్రెస్ విజ యం సాధించింది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక 2014, 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఆదరించారు.
నాలుగుసార్లు గెలిచిన ఉప్పల మల్సూర్
► ఈ ప్రాంతంలో తెలంగాణ వాదం బలంగా ఉండడంతో గత రెండు ఎన్నికల్లో ఇక్కడ బీఆర్‌ఎస్ గె లిచింది. 2014,2918లో గెలుపొందిన జగదీష్ రెడ్డి.. రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేశారు.
► 1952లో ద్విసభ్య నియోజకవర్గం నుంచి గెలిచిన ధర్మబిక్షం తర్వాత నకిరేకల్‌లో 1957, నల్లగొండలో 1962లో గెలిచారు.
► కడవరకు సాధారణ జీవితం గడిపిన మల్సూర్‌ను పేట ఓటర్లు నాలుగుసార్లు గెలిపించారు.
ప్రస్తుం ఓటర్లు ఇలా..
సూర్యాపేట నియోజకవర్గంలో 271 పోలింగ్ కేంద్రాల పరిధిలో 2,35,221 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,15,628 మంది పురుషులు, 1,19,576 మంది మహిళా ఓటర్లు, 17 మంది థర్డ్ జండర్ ఓటర్లు ఉన్నారు. సూర్యాపేట రూరల్ పరిధిలో 42,583 మంది ఓటర్లు ఉండగా, మున్సిపాలిటీ పరిధిలో 78,424 మంది ఓటర్లు, పెన్‌పహాడ్ మండలంలో 32,472 మంది ఓటర్లు, చివ్వెంల మండలంలో 40,257 మంది, ఆత్మకూర్(ఎస్) మండలంలో 41,485 మంది ఓటర్లు ఉన్నారు.
సూర్యాపేట నుంచి ఎమ్మెల్యేలు వీరే..
సంవత్సరం గెలిచిన అభ్యర్థి పార్టీ సమీప అభ్యర్థి పార్టీ
1952 ఉప్పల మల్సూర్ పీడీఎఫ్ జె.పి సర్వేష్ కాంగ్రెస్
1952 (ద్వి) బి. ధర్మబిక్షం పీడీఎఫ్ జి.ఏ.రెడ్డి కాంగ్రెస్
1957 ఉప్పల మల్సూర్ పీడీఎఫ్ ఇ.గోపయ్య కాంగ్రెస్
1957(ద్వి) భీంరెడ్డి నర్సింహారెడ్డి పీడీఎఫ్ ఆర్‌ఆర్.రావు కాంగ్రెస్
1962 ఉప్పల మల్సూర్ సీపీఐ గోపయ్య కాంగ్రెస్
1967 ఉప్పల మల్సూర్ సీపీఎం మారపంగు మైసయ్య కాంగ్రెస్
1972 యడ్ల గోపయ్య కాంగ్రెస్ కె.ఎల్లయ్య సీపీఎం
1978 ఎ. పరందాములు కాంగ్రెస్.ఐ ఎం.మైసయ్య జనతాపార్టీ
1983 ఈద దేవయ్య టీడీపీ బిఎం.రాజు కాంగ్రెస్
1985 డి.సుందరయ్య టీడీపీ ఎ.పరందాములు కాంగ్రెస్
1989 ఆకారపు సుదర్శన్ టీడీపీ ఈద దేవయ్య కాంగ్రెస్
1994 ఆకారపు సుదర్శన్ టీడీపీ జె.ఎల్లయ్య కాంగ్రెస్
1999 దోసపాటి గోపాల్ కాంగ్రెస్ ఆకారపు సుదర్శన్ టీడీపీ
2004 వేదాసు వెంకయ్య కాంగ్రెస్ పి.రజినీకుమారి టీడీపీ
2009 ఆర్.దామోదర్‌రెడ్డి కాంగ్రెస్ పోరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి టీఆర్‌ఎస్
2014 జి.జగదీష్‌రెడ్డి టీఆర్‌ఎస్ సంకినేని వెంకటేశ్వర్‌రావు ఇండిపెండెంట్
2018 జి.జగదీష్‌రెడ్డి టీఆర్‌ఎస్ రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కాంగ్రెస్
Comments
Please login to add a commentAdd a comment