పోచంపల్లిలో ‘నిఫ్ట్‌’ విద్యార్థుల సందడి | - | Sakshi
Sakshi News home page

పోచంపల్లిలో ‘నిఫ్ట్‌’ విద్యార్థుల సందడి

Published Fri, Jan 31 2025 1:39 AM | Last Updated on Fri, Jan 31 2025 1:39 AM

పోచంప

పోచంపల్లిలో ‘నిఫ్ట్‌’ విద్యార్థుల సందడి

భూదాన్‌పోచంపల్లి: హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ(నిఫ్ట్‌)లో ఫ్యాషన్‌ డిజైన్‌ కోర్సు అభ్యసిస్తున్న ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, గుజరాత్‌, కర్ణాటక, రాజస్తాన్‌, హైదరాబాద్‌ తదితర ప్రాంతాలకు చెందిన 37 మంది విద్యార్థులు స్టడీ టూర్‌లో భాగంగా గురువారం పోచంపల్లికి వచ్చారు. ఇక్కడ చేనేత సహకార సంఘం, కళాపునర్వి హ్యాండ్లూమ్‌ యూనిట్‌ను సందర్శించారు. నూలు, చిటికి కట్టడం, వార్పు, గ్రాఫ్‌పై డిజైనింగ్‌ చేయడం, టై అండ్‌ డై విధానం ద్వారా రంగులద్దకం, మగ్గాలను పరిశీలించారు. నూలు ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటారని, తయారుచేసిన వస్త్రోత్పత్తులను ఎలా మార్కెటింగ్‌ చేస్తారని, కార్మికులకు లభిస్తున్న గిట్టుబాటు ధర, పోచంపల్లి ఇక్కత్‌కు ఉన్న ప్రాముఖ్యతను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిఫ్ట్‌ ప్రొఫెసర్లు డాక్టర్‌ సశ్మిత పాండా, జ్యోతిర్మయి మాట్లాడుతూ.. ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సులో భాగంగా థియరీ చదువుకున్న విద్యార్థులకు చేనేత వస్త్రాల తయారీ విధానాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు పోచంపల్లి సందర్శనకు వచ్చామని పేర్కొన్నారు. పోచంపల్లి పర్యటన విద్యార్థులందరికి మంచి అనుభూతిని ఇచ్చిందని అన్నారు.

రంగులద్దకం విధానాన్ని తెలుసుకుంటున్న ఫ్యాషన్‌ డిజైన్‌ విద్యార్థులు

No comments yet. Be the first to comment!
Add a comment
పోచంపల్లిలో ‘నిఫ్ట్‌’ విద్యార్థుల సందడి1
1/1

పోచంపల్లిలో ‘నిఫ్ట్‌’ విద్యార్థుల సందడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement