అధికారం కోసం అలవిగాని హామీలు
దేవరకొండ : రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలిచ్చి ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించారు. అందనరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్లు, హామీలు, గ్యారెంటీల పేరుతో 420 బూటకపు హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు టీవీఎన్ రెడ్డి, గాజుల ఆంజనేయులు, దస్రూనాయక్, కేసాని లింగారెడ్డి, చింతపల్లి సుభాష్, పల్లా ప్రవీణ్‌రెడ్డి, రవికుమార్, శ్రీనివాస్‌గౌడ్, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ, రమేష్‌నాయక్, ఏసోబు తదితరులు పాల్గొన్నారు.
ఫ మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, బీఆర్ఎస్
జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్
Comments
Please login to add a commentAdd a comment