ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి అమలు | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి అమలు

Published Fri, Jan 31 2025 1:39 AM | Last Updated on Fri, Jan 31 2025 1:39 AM

ఎమ్మె

ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి అమలు

నల్లగొండ : వరంగల్‌ –ఖమ్మం –నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించినందున, నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రవర్తనా నియామవళి అమల్లోకి వచ్చిందని కలెక్టర్‌, ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఇలా త్రిపాఠి తెలిపారు. గురువారం ఆమె తన ఛాంబర్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఫిబ్రవరి 3న నోటిఫికేషన్‌, 10వ తేదీ వరకు నామినేషన్ల సమర్పణ, 11న నామినేషన్ల పరిశీలన, 13న నామినేషన్ల ఉపసంహరణ, 27న పోలింగ్‌, మార్చి 3న ఓట్ల లెక్కింపు ఉంటుందని.. మార్చి 8న ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. 2024 డిసెంబర్‌ 30న ప్రచురించిన తుది ఓటరు జాబితా ప్రకారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలో 200 పోలింగ్‌ కేంద్రాలు, 24,905 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. నల్లగొండ జిల్లాలో 4,483 మంది ఓటర్లు ఉన్నారని, 37 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించాలని అధికారులు, నాయకులకు సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, ఎన్నికల సక్రమ నిర్వహణకుగాను నోడల్‌ టీమ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పాటించాల్సిన నియమాలు, తీసుకోవాల్సిన అనుమతులను వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ జె.శ్రీనివాస్‌, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

సంరక్షణ బాధ్యత అధికారులదే..

చిన్నపిల్లలు, మహిళల సంరక్షణ బాధ్యత మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులదేనని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ, మహిళా శిశు సంరక్షణ, పాత అంగన్‌వాడీ కేంద్రాల మరమ్మతు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాత ఇళ్లలో నిర్వహిస్తున్న కేంద్రాల వల్ల పిల్లలకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి పాల్గొన్నారు.

ఇసుక అందుబాటులో ఉంచాలి

ప్రాజెక్టులు, స్థానిక పనులకు ఇసుక అందుబాటులో ఉండేలా చూడాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం ఆమె తన ఛాంబర్‌లో జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వంగమర్తి ఇసుక రీచ్‌లో ఇసుక తవ్వకాన్ని మరో ఆరు నెలలు పొడిగించి.. 3,66,613 క్యూబిక్‌ మీటర్ల ఇసుక తవ్వెందుకు కమిటీ ఆమోదించిందని తెలిపారు. ఇక్కడి నుంచి తీసిన ఇసుకను ఉదయ సముద్రం, ఎస్‌ఎల్‌బీసీ, మున్సిపల్‌ పనులు, వైటీపీఎస్‌, కిష్టాపురం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ పనులకు ఉపయోగించాలన్నారు. మూసీ ఎగువన కొత్తగా గుర్తించిన ప్రాంతంలో 70,980 క్యూబిక్‌ మీటర్ల ఇసుక తవ్వకానికి కమిటీ అనుమతించిది.. ఇందుకు మైనింగ్‌ అనుమతుల ప్రణాళిక సమర్పించాలని కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ జె.శ్రీనివాస్‌, జిల్లా గనుల శాఖ సహాయ సంచాలకులు శామ్యూల్‌ జాకబ్‌, ఇరిగేషన్‌, పంచాయతీరాజ్‌, భూగర్భ జలవనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

జాతీయ అమరవీరులకు నివాళి

నల్లగొండ : జాతీయ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం కలెక్టర్‌ ఇలా త్రిపాఠి కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాసేపు మౌనం పాటించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ జె.శ్రీనివాస్‌, కలెక్టరేట్‌ ఏఓ మోతిలాల్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి అమలు1
1/2

ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి అమలు

ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి అమలు2
2/2

ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి అమలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement