పెద్దగట్టు జాతరకు నిధులివ్వండి
ఫ సీఎం రేవంత్‌రెడ్డికి.. ఎంపీ రఘువీర్‌రెడ్డి విజ్ఞప్తి
ఫ శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నిర్వహించే పెద్దగట్టు (గొల్లగట్టు) జాతరకు నిధులు కేటాయించాలని సీఎం రేవంత్‌రెడ్డిని నల్లగొండ ఎంపీ రఘువీర్‌రెడ్డి కోరారు. గురువారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి ఈ మేరకు విన్నవించారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి ఫిబ్రవరి 16 నుంచి పెద్దగట్టు జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాట్లకు కావాల్సిన నిధులకు ప్రణాళికలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. జాతరకు దేశవ్యాప్తంగా భారీగా భక్తులు తరలిరానున్న నేపథ్యంలో మౌలిక వసతులు కల్పించాలన్నారు. గత ప్రభుత్వాల హయాంలో తాత్కాలిక ఏర్పాట్లు చేసి చేతులు దులుపుకుంటున్నారని, ఈసారి శాశ్వత ప్రాతిపదికన పనులు చేయాలని సీఎం సూచించారు. అవసరమైన చోట సీసీ రోడ్లు వేయాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment