ఖద్దరు పోరు.. ఖాకీల జోరు! | - | Sakshi
Sakshi News home page

ఖద్దరు పోరు.. ఖాకీల జోరు!

Published Sat, Aug 24 2024 12:54 AM | Last Updated on Sat, Aug 24 2024 12:54 AM

-

నియోజకవర్గంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్‌ చిన్నారెడ్డి వర్సెస్‌ ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నట్లుగా పరిస్థితులు నెలకొన్నాయి. కర్నెతండా పీహెచ్‌సీ ప్రారంభం, కేఎల్‌ఐ కాల్వలకు నీటి విడుదలలో ఎమ్మెల్యే లేకుండానే చిన్నారెడ్డి కార్యక్రమాలు నిర్వహించడం దుమారం రేపింది. ఇటీవల పట్టణంలో సిటీ బస్‌ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు కాగా ఎమ్మెల్యే గైర్హాజరు కావడంతో వాయిదా పడింది. అదే రూట్‌లో మరో రోజు ఎమ్మెల్యే బస్‌ను ప్రారంభించడం వివాదానికి దారి తీసింది. చిన్నారెడ్డి వేచిచూశారని.. ఆయన లేకుండా ఎలా ప్రారంభిస్తారంటూ ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో చిన్నారెడ్డి వర్గీయులను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లేందుకు బలవంతంగా వాహనాల్లో ఎక్కించడం మరింత ఉద్రిక్తతకు దారితీసింది. ఉన్నతాధికారులు జోక్యంతో సమస్య సద్దుమణిగినా.. టౌన్‌ ఎస్సై జయన్న దురుసు ప్రవర్తనపై చర్యలు తీసుకోవాలని చిన్నారెడ్డి వర్గీయులు ఎస్పీతో పాటు రాష్ట్రస్థాయి పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. కొందరు పోలీసులు పక్షపాతం చూపిస్తున్నారని చిన్నారెడ్డి వర్గం బాహాటంగానే విమర్శిస్తోంది.

ఆధిపత్యమే హద్దుగా పోలీసులతో రాజకీయాలు

కాంగ్రెస్‌లో తారస్థాయికి వర్గ విభేదాలు.. గద్వాల, వనపర్తిలో ముదిరిన వైరం

కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌, అలంపూర్‌ సెగ్మెంట్లలో విపక్షాలే టార్గెట్‌

పోలీస్‌శాఖను అడ్డుపెట్టుకుని వ్యవహారాలు చక్కబెడుతున్న పలువురు..

నలుగురు ఖాకీలపై వేటుతోఆ శాఖలో కలకలం

వనపర్తి

ప్రొటోకాల్‌ రగడ.. టౌన్‌ ఎస్‌ఐపై ఫిర్యాదు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement