ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు పరిష్కరించాలి

Published Sat, Aug 24 2024 12:54 AM | Last Updated on Sat, Aug 24 2024 12:54 AM

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు పరిష్కరించాలి

నారాయణపేట: ప్రభుత్వ నిబంధన ప్రకారమే ఎల్‌ఆర్‌ఎస్‌ ( లే అవుట్‌ రెగులలైజేషన్‌ స్కీం) దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రానికి సమీపంలోని సింగారం శివారులో గల 374, 375 సర్వే నంబర్ల లో ఓ యజమాని తన ప్లాట్‌ రెగ్యులరైజేషన్‌ కోసం ఆన్‌ లైన్‌లో చేసుకున్న దరఖాస్తును ఆ స్థలం వద్ద ఎల్‌ఆర్‌ఎస్‌ యాప్‌ ద్వారా కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా సదరు యజమాని ప్లాట్‌కు ప్రధాన రహదారికి ఎంత మేర విస్తీర్ణం ఉందని జిల్లా పట్టణ ప్రణాళిక అధికారి కిరణ్‌ కొలతలు చేయించి కలెక్టర్‌కు చూపించారు. ప్లాట్‌ రెగ్యులరైజేషన్‌ దరఖాస్తును యాప్‌ ద్వారా ఎలా పరిష్కరిస్తారని విషయాన్ని తెలిపాచారు. రెగ్యులరైజేషన్‌ కోసం యాప్‌లో ఉన్న ఎంపికలను ఒక్కొక్కటిగా కలెక్టర్‌ క్షుణ్ణంగా పరిశీలించారు. ప్లాట్‌ రెగ్యులరైజేషన్‌ విషయంలో రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారుల నివేదికలను తీసుకోవాలని జిల్లా టౌన్‌ ప్లానింగ్‌ అధికారికి ఆమె సూచించారు. మూడు శాఖల అధికారులు సమన్వయంతో ప్లాట్‌ రెగ్యులరైజేషన్‌ దరఖాస్తుకు పరిష్కారం చూపాలని, ఏమైనా అభ్యంతరాలు ఉంటే నిలిపి వేయాలని ఆమె తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement