
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ కలకలం రేపుతోంది. దేశంలో రోజుకో కొత్త రికార్డుతో బెంబేలెత్తిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించిన గణాంకాల ప్రకారం రోజువారీ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో రెండు లక్షల మార్క్‌ను దాటేసింది. గడచిన 24 గంటల్లో 2,00,739 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే మరణాల సంఖ్య 1038గా నమోదైంది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య1.40 కోట్లను దాటేసింది. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,73,123కి చేరింది.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మరింత విజృంభిస్తోంది. వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 3,307 పాజిటివ్ కేసులు నమోదు కాగా, నిన్న ఎనిమిది మంది మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,788కి చేరింది.
(షాపింగ్ మాల్స్‌కు కరోనా సెకండ్ వేవ్ షాక్!)
Comments
Please login to add a commentAdd a comment