
ముంబై: కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు ఆర్థిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగాను దేశం క్షీణించింది. ప్రత్యేకంగా వైరస్ వీర విహారం చేసిన రాష్ట్రాలలో ముంబై ఒకటి. సెకండ్‌వేవ్‌లో మహమ్మారి విజృంభణ తరువాత ముంబై నగరంలో మొదటిసారిగా గడిచిన 24 గంటల్లో ఎటువంటి కోవిడ్ మరణాలను నమోదు కాలేదు. నగరంలో ఆదివారం 367 కేసులను నమోదయ్యాయి. ప్రస్తుతం 5,030 యాక్టివ్ కేసులు ఉన్న ఈ మహానగరంలో పాజిటివిటీ రేటు 1.27% కి తగ్గింది.
అదే క్రమంలో రికవరీ రేటు 97% ఉంది. గత 24 గంటల్లో 28,600 కి పైగా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. నగరంలో కంటైన్‌మెంట్ జోన్‌లు లేనప్పటికీ, ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు 50 భవనాలు మూసివేశారు. సెకండ్ వేవ్ సమయంలో వైరస్ వీర వీహారం చేస్తూ ప్రజల వెన్నులో వణుకు పుట్టించింది. దేశంలో ప్రధానంగా ముంబై నగరంలో ఒక రోజుకి 11,000 కేసులు, వందల సంఖ్యలో మరణాలతో అల్లాడించింది.అప్పట్లో రోజువారీ కేసులలో అమాంతం పెరుగడంతో నగరంలో ఆరోగ్య సంరక్షణ ఇన్‌ఫ్రాతో పాటు ఆక్సిజన్ సరఫరా లేకపోవడంతో రోగులకు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ముంబైలో ఇప్పటివరకు 7,50,808 కరోనావైరస్ కేసులు నమోదు కాగా 16,180 మంది మరణించారు.
చదవండి: Pune Woman Dont Want To Beg: ‘నాకు అడుక్కోవాలని లేదు.. పెన్నులు కొనండి చాలు’
Comments
Please login to add a commentAdd a comment