వడోదరా: గుజరాత్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య విపరీతంగా పెరగుతున్నాయి. వడోదర జిల్లాలోని పారుల్ ఆసుపత్రి సిబ్బంది కరోనా రోగుల్లో నెలకొన్న భయాన్ని పోగొట్టి వారిలో చైతన్యం నింపడానికి మ్యూజిక్ థెరపీని వైద్యులు ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రి శుక్రవారం మ్యూజిక్ థెరపీని ప్రారంభించింది. రోగుల ఎదుట సంగీతానికి అనుగుణంగా నృత్యం చేస్తూ వారిని ఉత్సాహపరుస్తున్నారు. ఇలా చేయడం ద్వారా కొవిడ్ గురించి బాధితుల్లో ఉన్న మానసిక ఆందోళన తగ్గి వారిలో స్థైర్యం పెరుగుతుందని వైద్యులు పేర్కొన్నారు. మ్యూజిక్ థెరపీకి రోగులు బాగా స్పందిస్తున్నారని వారు తెలిపారు. గతంలో కూడా ఇలాంటి చర్యలు అనేక ఆసుపత్రిలో మనం చూశాం.
Comments
Please login to add a commentAdd a comment