
న్యూఢిల్లీ: ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ తిరిగి హస్తం గూటికి చేరారు. తొమ్మిదేళ్ల కిందట పార్టీని వీడిన గమాంగ్ బుధవారం కుటుంబ సమేతంగా తిరిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో సీనియర్ నేత అజయ్ మాకెన్ సమక్షంలో పార్టీలో చేరారు.
కాంగ్రెస్‌ను వీడిన తర్వాత గమాంగ్ 2015లో బీజేపీలో చేరారు. అనంతరం 2023లో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌కు కూడా గుడ్‌బై చెప్పారు. తాజాగా తన మాతృ పార్టీ కాంగ్రెస్ గూటికి చేరారు. గమాంగ్ 1999లో కొద్ది నెలల పాటు ఒడిషా ముఖ్యమంత్రిగా పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment