సాక్షి, ఢిల్లీ: జూన్ 24వ తేదీన పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ ఎవరు అనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేపీ నుంచే స్పీకర్‌ఉంటారని జేడీయూ స్పష్టం చేసిన నేపథ్యంలో ఓం బిర్లానే మరోసారి స్పీకర్ రేసులో ఉన్నారనే చర్చ నడుస్తోంది.
ఇక, జూన్ 24న సమావేశాల ప్రారంభం నేపథ్యంలో తొలి రెండు రోజులు పార్లమెంట్ సభ్యులు ప్రమాణ స్వీకారం ఉంటుంది. 25వ తేదీన స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడనుంది. దీంతో, ఈనెల 26వ తేదీన లోక్‌సభ ఎన్నికల స్పీకర్ ఎన్నిక ఉండే అవకాశం ఉంది. అయితే, లోక్‌సభలో బీజేపీకి మెజార్టీ లేకపోవడంతో ఆమోదయోగ్యమైన వ్యక్తి కోసం అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. 2014లో లోక్‌సభ స్పీకర్‌గా సుమిత్రా మహాజన్, 2019లో ఓం బిర్లాను ప్రధాని మోదీనే ఎంపిక చేశారు. ఇక, ఈసారి కూడా ఆశ్చర్యకర పద్దతిలో స్పీకర్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది. అయితే, స్పీకర్‌గా మరోసారి ఓం బిర్లా ఛాన్స్ దక్కనుందనే చర్చ నడుస్తోంది. ఇదిలా ఉండగా.. జూన్ 27వ తేదీ నుంచి జూలై మూడో తేదీ వరకు రాజ్యసభ సమావేశాలు జరుగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment