
ఢిల్లీ: సుప్రీంకోర్టుకు కొత్తగా 9 మంది న్యాయమూర్తులు నియమితులయ్యారు. రాష్ట్రపతి ఆమోదంతో కేంద్రం గెజిట్ విడుదల చేసింది. కొత్త జడ్జిలుగా జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బీవీ నాగరత్నం, జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ రవికుమార్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఏఎస్ ఒకా, జస్టిస్ విక్రమ్‌నాథ్ నియమితులయ్యారు. కొత్తగా 9 మంది నియామకంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరింది.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని కొలీజియం ఆగస్టు 18న తొమ్మిది మంది పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ తొమ్మిది మందిలో ముగ్గురు మహిళలు, బార్ నుంచి ఒకరు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment