గుజరాత్‌లో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి బాహుబలి నాయకుడిగా పేరుగాంచిన మధుబాయ్ శ్రీవాస్తవ్‌కి బీజేపీ అధిష్టానం మొండిచేయి చూపింది. ఆయన ఈసారి నామినేట్ చేయకూడదనే ఉద్దేశ్యంతో బీజేపీ టిక్కెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో శ్రీ వాస్తవ్ ఇండిపెండింట్‌గా పోటీ చేయాలనుకుంటున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా ఏమి చేయలేరని, అంతా ఢిల్లీలోని అగ్రనాయకత్వం నిర్ణయిస్తుందని అన్నారు.
శ్రీ వాస్తవ్ 2002 గుజరాత్ అల్లర్ల కేసులో స్థానికి బలమైన రాజకీయ నాయకుడిగా పేరొందాడు. తనకు టిక్కెట్ నిరాకరించడంతో ప్రధాని మోదీని, అమిత్‌షాను ఇక కలవలేదని చెప్పారు. తాను 1995లో స్వతంత్ర అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలవడంతో నరేంద్ర మోదీ, అమిత్‌షాలు తనను పార్టీలో చేరాలని అభ్యర్థించారని, అదువల్లే బీజేపీలోకి చేరానని చెప్పారు. తన కుటుంబ సభ్యులంతా ఇతర పార్టీల్లో ఉన్నారని చెప్పుకొచ్చారు.
ప్రధాని మోదీ ముఖ్యమంత్రి కావడానికి ముందు రాష్ట్రంలో బీజేపీ కార్యకర్త అని, కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్ షా అప్పుడూ రాష్ట్ర స్థాయి నాయకుడని అన్నారు. ఆయన స్థానంలో టిక్కెట్ పొందిన వదోదర జిల్లా బీజేపీ చీఫ్ అశ్విన్ పటేల్ స్థానిక ఎన్నికల్లో కూడా గెలవలేదని విమర్శించారు. తనపట్ల బీజేపీ చూపించిన వైఖరికీ చాలా కలతా చెందానని ఆవేదనగా చెప్పారు.
ఐతే శ్రీవాస్తవ్ గత కొన్ని రోజులుగా రాష్ట్ర మంత్రి హర్ష్ సంఘ్వీని కలవడానికి నిరాకరించిన ఆరుగురు తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో ఆయన ఒకరని అధికారిక వర్గాల సమాచారం. కానీ శ్రీ వాస్తవ్ వ్యాఖ్యలపై బీజేపీ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈసారి బీజేపీ గుజరాత్‌లో మొత్తం 282 సీట్లలో 160 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాలో ఐదుగురు మంత్రులు, అసెంబ్లీ స్పీకర్‌తో సహా 38 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను తొలగించింది.
Comments
Please login to add a commentAdd a comment