
చెన్నై: తమిళనాడులోని రాజ్ భవన్ లో పనిచేస్తున్న 84 మంది సిబ్బందికి కరోనా సోకినట్లు గురువారం నిర్థారణ అయింది. దీంతో వారందరినీ క్వారంటైన్‌కు తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే వీరెవరూ గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ తో కలవలేదని అధికారులు చెప్పారు. రాజ్ భవన్లో విధులు నిర్వహిస్తున్న 147 మంది సిబ్బందిలో 84 మందికి కరోనా సోకిందని తెలిపారు. వీరంతా రాజ్ భవన్ గేటు వద్ద, గేటు వెలుపల విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.